Viral Video : 3 సెకన్ల ప్రాడక్ట్ ప్రమోషన్‌తో వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

ఒక ప్రాడక్ట్ ప్రమోట్ చేయడానికి 3 సెకన్ల టైమ్.. వారంలో రూ.120 కోట్ల ఆదాయం సంపాదిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరో తెలుసా?

Viral Video : 3 సెకన్ల ప్రాడక్ట్ ప్రమోషన్‌తో వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తున్న సోషల్ మీడియా  ఇన్‌ఫ్లుయెన్సర్

Viral Video

Viral Video : ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ రకరకాల ప్రాడక్ట్స్ ప్రమోట్ చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక చైనీస్ యువతి సంపాదన తెలిస్తే నోరెళ్లబెడతారు. ఒక ఉత్పత్తికి  3 సెకన్లు ప్రమోషన్‌కి కేటాయించి అనేక ఉత్పత్తులు ప్రమోట్ చేస్తూ వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తోంది ఆ యువతి. వండర్ కదా.

Hyderabad : ప్రొఫెషనల్స్ కోట.. అమీర్‌పేట.. వైరల్ వీడియో

తెలుగు సినిమాలో ‘అమ్మా.. మెరుపు తీగ ఒకసారి వచ్చి వెళ్లు అమ్మా’ అనే డైలాగ్ గుర్తుంది కదా.. సేమ్ ఒక చైనా యువతి సోషల్ మీడియాలో చేసే వస్తువుల ప్రమోషన్ కూడా అలాగే ఉంటుంది. మెరుపు వేగంతో అనేక ఉత్పత్తులను తన వీడియోల్లో ప్రమోట్ చేస్తుంటుంది. టిక్ టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్‌లో ఐదు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే యువతి చేసే ప్రచారం మామూలుగా ఉండదు. కళ్లు మూసి తెరిచే లోపు ఉత్పత్తులు ప్రమోషన్ జరిగిపోతుంటుంది. ఒక ఉత్పత్తికి కేవలం 3 సెకన్ల సమయం మాత్రమే వెచ్చిస్తూ అనేక ప్రాడక్ట్స్ ప్రచారం చేస్తూ వారానికి దాదాపుగా $14 మిలియన్లు ( ఇండియన్ కరెన్సీలో దాదాపుగా  రూ.120 కోట్లు) సంపాదిస్తోంది.

Anand Mahindra : మీరు ఇలా తయారు చేయగలరా? నేను పెట్టుబడి పెడతా..! ఆనంద్ మహీంద్ర ట్వీట్.. వీడియో వైరల్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లు అనేకమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆదాయ వనరుగా మారాయి. ఒకప్పుడు ప్రత్యేక ప్రకటనల ద్వారా తమ ఉత్పత్తును ప్రమోట్ చేసేవారు. ఇప్పుడు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ వీడియోలలో ప్రమోషన్లు చేస్తూ పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జెంగ్ వీడియో వైరల్ అవుతోంది. డిజిటల్ ప్రపంచాన్ని సరైన మార్గంలో వినియోగించుకునేవారికి ప్రతి సెకను ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనడానికి జెంగ్ ఉదాహరణగా నిలిచింది.