Hyderabad : ప్రొఫెషనల్స్ కోట.. అమీర్‌పేట.. వైరల్ వీడియో

విద్యార్ధులతో భారీ రద్దీగా ఉండే అమీర్ పేట ప్రాంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమీర్ పేట ప్రొఫెషనల్స్ కోట అంటున్నారు నెటిజన్లు.

Hyderabad : ప్రొఫెషనల్స్ కోట.. అమీర్‌పేట.. వైరల్ వీడియో

Hyderabad

Hyderabad : భాగ్యనగరంలో నిత్యం రద్దీగా ఉండే అమీర్‌పేటను అసలైన సాంకేతిక విద్యా కేంద్రంగా (టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంటర్) పిలుస్తారు. డేటా సైన్స్ కోర్సులే కాదు లాప్ టాప్ కోర్సుల వరకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎటు చూసినా పోస్టర్లు, బ్యానర్లతో దర్శనమిచ్చే అమీర్‌పేటకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌లోని అమీర్‌పేట నిత్యం విపరీతమైన రద్దీతో దర్శనమిస్తుంది. ఇక్కడ అనేక రకాల కోర్సులు బోధించే కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. వాటికి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు దర్శనం ఇస్తుంటాయి. ఎక్కడెక్కడి నుండో వచ్చిన వేలాదిమంది విద్యార్ధులతో ఈ ప్రాంతం బిజీగా కనిపిస్తుంది. అంతేకాదు ఎంతోమంది ఇక్కడ కోచింగ్ తీసుకుని విదేశాల్లో సైతం స్థిరపడిన వారున్నారు. చాలామంది ఈ ప్రాంతాన్ని USA (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్ పేట) అని కూడా పిలుస్తారు. కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం విపరీతమైన ప్రజాదరణ పొందింది. అమీర్‌పేటకు సంబంధించిన ఓ వీడియోను స్టార్టప్ ఫౌండర్ అక్షయ్ నరిసెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది హైదరాబాద్‌లోని అసలైన అమీర్ పేట. ఇక్కడ డేటా సైన్స్ కోర్సుల నుండి లాప్ టాప్ కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని కోర్సులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి’ అంటూ పోస్టు పెట్టారు.

Also Read : హైదరాబాద్-విజయవాడ హైవే వెంట రియల్‎కు భారీ డిమాండ్

ఇక ఈ వీడియోపై నెటిజన్లు పాజిటివ్‌గా నెగెటివ్‌గా కూడా స్పందించారు. తాము అక్కడ చేసిన కోర్సుల గురించి చాలామంది మాట్లాడారు. విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలనే పిచ్చి కోరికతో అక్కడికి చాలామంది వస్తారని కొందరు మాట్లాడారు. ఇరుకైన భవనాలు, గదుల్లో శిక్షణ ఇస్తారని.. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే సరైన భద్రత లేదని విమర్శించారు. 20 కంటే ఎక్కువ మంది కూర్చునే కెపాసిటీ లేని గదుల్లో 40 మందిని కూర్చోబెట్టి శిక్షణ ఇస్తారని.. గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా సైతం తమ నివేదికలో పేర్కొంది. అమీర్‌పేట మాత్రం ప్రొఫెషనల్స్ కోట.. అంటూ కొందరు కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.