Hyderabad-Vijayawada Highway : హైదరాబాద్-విజయవాడ హైవే వెంట రియల్‎కు భారీ డిమాండ్

Hyderabad-Vijayawada Highway : గ్రేటర్ హైదరాబాద్ అన్ని వైపులా అభివృద్ధికి అవకాశమున్న సిటీ. గడిచిన కొన్నేళ్లుగా వెస్ట్ హైదరాబాద్‌ బాగా అభివృద్ది చెందింది. ఐటీ పరిశ్రమను ఆధారం చేసుకుని ఎక్కువ నిర్మాణాలు, ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.

Hyderabad-Vijayawada Highway : హైదరాబాద్-విజయవాడ హైవే వెంట రియల్‎కు భారీ డిమాండ్

Hyderabad-Vijayawada highway

Hyderabad-Vijayawada Highway : హైదరాబాద్‌ అభివృద్ధి నలువైపులా పరుగులు తీస్తోంది. హైదరాబాద్ తూర్పు వైపు ఉన్న విజయవాడ హైవే వైపు రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. ఎల్బీనగర్ నుంచి మొదలు చౌటుప్పల్, సూర్యాపేట వరకు అనేక ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్డు కావడంతో రియల్‌ ఎస్టేట్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది. ఈ హైవే వెంట ఇండస్ట్రియల్ క్లస్లర్స్ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఈ మార్గంలో రియాల్టీకి మరింత ఊపు వచ్చే అవకాశముంది.

Read Also : Real Estate East Hyderabad : మహానగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్టీ రంగం.. ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్‌ చాయిస్‌గా ఈస్ట్‌ హైదరాబాద్‌!

ఈస్ట్ వైపు శరవేగంగా హైదరాబాద్‌ సిటీ విస్తరణ :
గ్రేటర్ హైదరాబాద్ అన్ని వైపులా అభివృద్ధికి అవకాశమున్న సిటీ. గడిచిన కొన్నేళ్లుగా వెస్ట్ హైదరాబాద్‌ బాగా అభివృద్ది చెందింది. ఐటీ పరిశ్రమను ఆధారం చేసుకుని ఎక్కువ నిర్మాణాలు, ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ ప్రాంతంలో ఒక ఎకరా భూమి 100 కోట్ల రూపాయల ధర పలికిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్లాట్లు, విల్లాలు, ఒపెన్ ల్యాండ్స్‌ కూడా భారీ ధర పలుకుతున్నాయి. ఇప్పుడు అదే పద్ధతిలో అభివృద్దికి అవకాశం ఉన్న ప్రాంతం ఈస్ట్ హైదరాబాద్ అంటున్నారు రియల్ రంగ నిపుణులు. విజయవాడ వెళ్లే హైవే మార్గం భవిష్యత్తు రియల్ మార్కెట్‌కు మరింత స్కోప్ ఉందంటున్నారు.

మరింత పెరగనున్న నిర్మాణాలు :
హైదరాబాద్ – విజయవాడను కలిపే ఈ  హైవే మార్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంచి రవాణా సౌకర్యంతోపాటు… ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఈ రోడ్డు విస్తరణ అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ ఈస్ట్‌ ప్రాంతంలో భూముల ధరలు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వంటి మౌలిక వసతులు ఇక్కడ రియాలీటి రంగానికి ప్లస్ కానున్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి, కాలుష్య రహిత వాతావరణం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ప్రభుత్వ ప్రణాళికలు హైదరాబాద్ విజయవాడ హైవే వైపు రియల్ రంగ అభివృద్ధికి మరింత దోహదపడనున్నాయి.

మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఈస్ట్‌ సైడ్‌ భూముల ధరలు కాస్త అనుకూలంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు భారీగా పెరుగుతుండడంతో ఆ ప్రాంతాల్లో రియల్టీ రంగం ఫుల్‌ జోష్‌లో ఉంది. ప్రస్తుతం రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈస్ట్‌ హైదరాబాద్‌ ప్రస్తుతం బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది.

Read Also : Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!