Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అని కాదు.. పవర్ స్టార్ అని పిలవాలి.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్
పవన్ కళ్యాణ్ అని కాదు, పవర్ స్టార్ అని పిలవాలి అంటూ యాంకర్ కి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచన.

Indian cricketer Irfan Pathan comments about Pawan Kalyan gone viral
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క తెలుగు భాషలోనే కాదు, ఇతర లాంగ్వేజ్స్ లో కూడా పవన్ కి అభిమానులు ఉంటుంటారు. పవన్ సినిమాలను డబ్బింగ్ రూపంలో చూడడమో, లేదా పవన్ హ్యుమానిటీ తెలిసి అభిమానులు అవ్వడం జరుగుతుంది. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు, ఇతర భాషలోని సెలబ్రిటీస్ కూడా పవన్ ని ఇష్టపడుతుంటారు.
బాలీవుడ్, కోలీవుడ్ ఇలా సినిమా రంగంలోనే వారు మాత్రమే కాకుండా, క్రీడా రంగానికి సంబంధించిన వారు కూడా పవన్ ని ఇస్తా పడుతుంటారు. అలా పవన్ ని ఇష్టపడిన వారి లిస్టులో భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఉన్నారు. రీసెంట్ గా ఈ క్రికెటర్ తెలుగు స్టేట్ లో జరిగిన ఐపీల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో తెలుగు హీరోల డైలాగ్స్ ని ఇర్ఫాన్ చెబుతూ సందడి చేశారు.
Also read : Family Star : ఐరనే వంచాలేంటి.. జుట్టు దువ్వుకున్నా సరిపోదు.. ఫ్యామిలీ స్టార్ ఏం చేస్తున్నా వైరలే..
ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలోని ‘నా కొంచెం తిక్క ఉంది. దానికో లెక్క ఉంది’ డైలాగ్ ని చెప్పారు. అయితే ఈ డైలాగ్ చెప్పే సమయంలో యాంకర్ పవన్ కళ్యాణ్.. అని ప్రస్తావించింది. దానికి ఇర్ఫాన్ రియాక్ట్ అవుతూ.. “పవన్ కళ్యాణ్ అని కాదు, మీరంతా ఆయనని పవర్ స్టార్ అని పిలుస్తారు కదా. ఆయనని అలాగే పిలవండి” అంటూ యాంకర్ చెప్పారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Don’t Say @PawanKalyan
Its Power star Pawan Kalyan ??
: Cricketer @IrfanPathan pic.twitter.com/VqLD0cHCky— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) February 7, 2024
కాగా ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల్లో నటించారు. భారత జట్టు తరుపున ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడుతున్న సమయంలోనే ఇర్ఫాన్.. 2004లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘ముజ్‌సే షాదీ కరోగి’ అనే సినిమాలో గెస్ట్ అపిరెన్స్ ఇచ్చారు. ఆ తరువాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. కానీ రిటైర్మెంట్ తరువాత 2022లో తెరకెక్కిన తమిళ మూవీ ‘కోబ్రా’లో ముఖ్య పాత్ర చేసి ఆడియన్స్ ని పూర్తి స్థాయి నటుడిగా పలకరించారు. మరి భవిషత్తులో ఇంకేమైనా సినిమాల్లో కనిపిస్తారేమో చూడాలి.