Sagar Pandey : సల్మాన్ ఖాన్ డూప్ ఆకస్మిక మరణం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సల్లూ భాయ్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కి దాదాపు 50కి పైగా సినిమాల్లో డూప్‌ గా నటించిన సాగర్‌ పాండే ఆకస్మికంగా కన్నుమూశారు. సాగర్‌ పాండే జిమ్‌ చేస్తుండగా అస్వస్థతకు గురవ్వడంతో జిమ్ నిర్వాహకులు అతడిని.............

Sagar Pandey :  హీరోలందరి డూపులు ఉంటారని తెలిసిందే. యాక్షన్ సన్నివేశాల్లో, కొన్ని కొన్ని సన్నివేశాల్లో హీరోలకి బదులు డూపులు నటిస్తారు. ఇక డబల్ రోల్స్ ఉంటే కూడా ఈ డూపులనే వాడతారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కి దాదాపు 50కి పైగా సినిమాల్లో డూప్‌ గా నటించిన సాగర్‌ పాండే ఆకస్మికంగా కన్నుమూశారు.

సాగర్‌ పాండే జిమ్‌ చేస్తుండగా అస్వస్థతకు గురవ్వడంతో జిమ్ నిర్వాహకులు అతడిని ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూనే సాగర్ పాండే తుదిశ్వాస విడిచాడు. సాగర్‌ పాండే మృతిపట్ల సల్మాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు సల్మాన్‌ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Chiranjeevi : రాజమౌళితో నేను సినిమా చేయను.. నేనే దర్శకుడిగా మారుతాను..

‘భాయిజాన్‌’ మూవీ సెట్‌లో సాగర్‌ పాండేతో కలిసి దిగిన ఫొటోను సల్మాన్‌ షేర్‌ చేస్తూ.. హార్ట్‌ బ్రేకింగ్‌, అతని ఆత్మకి శాంతి చేకూరాలని పోస్ట్ చేశాడు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సల్మాన్ అభిమానులు కూడా సాగర్‌ పాండే మృతికి సంతాపం తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు