Salman Khan : ఆమె మరణంతో స్మశాన వాటిక దగ్గర ఏడ్చేసిన సల్మాన్ ఖాన్.. వీడియోలు వైరల్..
ఆమె అంత్యక్రియలను నేడు మధ్యాహ్నం ముంబైలోని ఓ స్మశాన వాటికలో నిర్వహించారు. (Salman Khan)
Salman Khan
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇవాళ ఓ స్మశాన వాటిక వద్ద ఏడుస్తూ కనిపించడంతో వీడియోలు వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫ్రెండ్, అత్యంత సన్నిహితురాలు కుముద్ రాణే నేడు ఉదయం మరణించింది. ఆమె అంత్యక్రియలను నేడు మధ్యాహ్నం ముంబైలోని ఓ స్మశాన వాటికలో నిర్వహించారు.
కుముద రాణే అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. సల్మాన్, ఆమె తల్లి సల్మా, తమ్ముడు సోహైల్ ఖాన్, పినతల్లి హెలెన్, చెల్లి అర్పిత ఖాన్, సల్మాన్ తమ్ముడి కొడుకులు అర్హన్ ఖాన్, నిర్వాన్ ఖాన్.. ఇలా కుటుంబం అంతా కుముద్ రాణే అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలు అనంతరం సల్మాన్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి రెడీ.. వెంకీమామ, కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..
సల్మాన్ ఏడుస్తూ బయటకు వచ్చారు. ఆ బాధతోనే కన్నీళ్లతో కార్ ఎక్కి స్మశాన వాటిక నుంచి వెళ్లిపోయారు. దీంతో సల్మాన్ స్మశాన వాటిక వద్ద ఎమోషనల్ అయిన వీడియోలు వైరల్ గా మారాయి. తమ అభిమాన హీరో ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
కుముద్ రాణేకి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఫ్యామిలీ, సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా అత్యంత సన్నిహితులు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అందుకే సల్మాన్ అంత ఎమోషనల్ అయ్యాడు అని బాలీవుడ్ సమాచారం.
