సల్మాన్ ఖాన్.. పర్సనల్ కేర్ బ్రాండ్ ఇదే.. శానిటైజర్లతోనే బిగిన్!

  • Published By: srihari ,Published On : May 26, 2020 / 04:09 AM IST
సల్మాన్ ఖాన్.. పర్సనల్ కేర్ బ్రాండ్ ఇదే.. శానిటైజర్లతోనే బిగిన్!

Updated On : May 26, 2020 / 4:09 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త బిజినెస్ వెంచర్ ప్రారంభించాడు. FRSH అనే బ్రాండ్ పేరుతో పర్సనల్ కేర్ బ్రాండ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు. ఈ కొత్త బ్రాండ్ కింద మొట్టమొదటిగా శానిటైజర్లను ప్రారంభించారు. తన న్యూ గ్రూమింగ్, పర్సనల్ కేర్ బ్రాండ్ FRSHను లాంచ్ చేస్తున్నట్టు మే 24న రాత్రి సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ ద్వారా ప్రకటించాడు. తొలుత ఈ బ్రాండ్ కింద డియోడరెంట్స్ లాంచ్ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిపాడు. కానీ, ముందుగా శానిటైజర్లతో బిజినెస్ మొదలు పెట్టాలని భావించినట్టు పేర్కొన్నాడు. కరోనా వైరస్ (కొవిడ్-19) మమహ్మారితో శానిటైజర్ల వినియోగానికి భారీ డిమాండ్ ఏర్పడింది. 

ప్రపంచవ్యాప్తంగా గజగజ వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ బారినుంచి ప్రొటెక్ట్ కోసం శానిటైజర్ వినియోగం వాడకం తప్పనిసరిగా మారింది.  ఇప్పటివరకూ 54 లక్షల మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే 3.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని యూనివర్శటీ డేటా Johns Hopkins వెల్లడించింది. శానిటైజర్ల తర్వాత ఇతర ప్రొడక్టుల్లో డియోడరెంట్స్, బాడీ వైప్స్, పెర్ఫ్యూమ్స్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా బ్రాండ్ కింద విడుదల చేయనున్నట్లు ఆయన సందేశంలో తెలిపారు.

ప్రస్తుతం, 72 శాతం ఆల్కహాల్ ఆధారిత FRSH శానిటైజర్లు దాని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. తరువాత ఈ ప్రొడక్టు స్టోర్స్‌లో లభిస్తుందని సల్మాన్ తెలిపారు. FRSH 100 మిల్లీమీటర్ బాటిల్ శానిటైజర్‌కు రూ .50, 500 మి.లీ బాటిల్ శానిటైజర్‌కు రూ .250 ఖర్చవుతుంది. అయితే, ఒకరు కాంబో సెట్స్‌కి వెళితే, 10 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని వెబ్‌సైట్ తెలిపింది.

Read: లైట్స్, కెమెరా, యాక్షన్ : షూటింగ్ లకు రెడీగా ఉన్న హీరోలు, డైరెక్టర్లు