Salman Khan : ట్రైలర్ చూసి మజా వచ్చిందంటున్న సల్మాన్.. ఎవరి సినిమా గురించో తెలుసా..?

ఆ మూవీ ట్రైలర్ తనకి బాగా నచ్చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ వేశాడు సల్మాన్ ఖాన్. అంతేకాదు ఆ మూవీని మొదటిరోజే చూస్తాను అంటూ కూడా రాసుకొచ్చాడు.

Salman Khan tweet on Shah Rukh Khan Jawan trailer gone viral

Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆ మూవీ ట్రైలర్ చూసి తనకి మజా వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ వేశాడు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, తనకి బాగా నచ్చిందని, ఇలాంటి సినిమాలే ఇప్పుడు థియేటర్స్ లో చూడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమాని మొదటిరోజే చూస్తాను అంటూ కూడా రాసుకొచ్చాడు. ఇంతకీ సల్మాన్ ఇంతలా పొగిడేస్తున్నా ఆ మూవీ ఎవరిది అని ఆలోచిస్తున్నారా..? అదే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ (Jawan) మూవీ.

Game Changer : యాక్షన్ సీక్వెన్స్‌తో గేమ్ చెంజర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్.. ఆగష్టులో సర్‌ప్రైజ్..!

పఠాన్ ఇప్పుడు జవాన్ అయ్యాడు అంటూ ఆ మూవీ ట్రైలర్ ని షేర్ చేస్తూ తన ఫీలింగ్ ని తెలియజేశాడు. ప్రస్తుతం సల్మాన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా జవాన్ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తుంటే.. తమిళ్ హీరో విజయ్ మరియు దీపికా పడుకోణె గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. ట్రైలర్ మూవీ పై అంచనాలు క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 7న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Vijay : మరోసారి అభిమానులతో విజయ్ భేటీ.. రాజకీయం గురించేనా..?

ఇక సల్మాన్ ఖాన్ సినిమాలు విషయానికి వస్తే, ఇటీవలే ‘కిసీకీ భాయ్ కిసీకీ జాన్’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన భాయ్.. ఇప్పుడు టైగర్ 3 (Tiger 3) సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఇప్పుడు వాటికీ కొనసాగింపుగా మూడో బాగానే తీసుకు వస్తున్నాడు. ముందు రెండు భాగాల్లో హీరోయిన్ గా చేసిన కత్రినా కైఫ్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.