మేనల్లుడి మరణం.. బాధలో భాయ్‌జాన్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూత..

  • Published By: sekhar ,Published On : March 31, 2020 / 10:54 AM IST
మేనల్లుడి మరణం.. బాధలో భాయ్‌జాన్..

Updated On : March 31, 2020 / 10:54 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూత..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట విషాదం నెలకొంది. సల్లూ భాయ్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ (మార్చి 30) సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ అబ్దుల్లాతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి సంతాపం ప్రకటించారు.

గతకొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్లా పరిస్థితి విషమించడంతో మృతి చెందారని వైద్యులు తెలిపారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్  చెల్లెలు కుమారుడు అబ్దుల్లా.. వృత్తి రీత్యా బాడీ బిల్డర్ అయిన అబ్దుల్లా మేనమామ సల్మాన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

కాగా సల్మాన్, అబ్దుల్లాల మధ్య మంచి అన్యోనత ఉందని బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. గతంలో సల్మాన్ అప్పుడప్పుడు మేనల్లుడితో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. అబ్దుల్లా మరణ వార్త తెలియగానే పలువురు బాలీవుడ్ సెటబ్రిటీలతో పాటు సల్మాన్ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

Read Also : కోట్లు ఖర్చుపెట్టాం.. దీనెబ్బా కరోనా.. బండ్ల గణేష్

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Will always love you…

A post shared by Salman Khan (@beingsalmankhan) on T