Samantha: సమంతకు ఆ సీరియస్ జబ్బు.. త్వరలోనే కోలుకుంటానని ప్రకటన

యశోద ట్రైలర్‭కు మీ స్పందన బాగుంది. ముగింపులేని సవాళ్లు జీవితం ముందున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‭కు చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగానే ఉంది

Samantha: సమంతకు ఆ సీరియస్ జబ్బు.. త్వరలోనే కోలుకుంటానని ప్రకటన

samanta shares on social media her health condition

Updated On : October 29, 2022 / 4:43 PM IST

Samantha: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్టార్ బ్యూటీ సమంత, అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తన అనారోగ్యంపై స్పందించారు. తనకు ఇమ్యూనిటీ డిజార్డర్ ఉందని, తొందరలోనే కోలుకుంటానని తన ఇన్‭స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించింది. చేతికి సెలైన్‭తో టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్న సమంత.. రెండు చేతులతో లవ్ సింబల్ (ఆరోగ్యం కుదుటపడుతుందనే అర్థంలో) చూపిస్తున్న ఇమేజ్ ఇన్‭స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఆ వివరాలను వెల్లడించింది.

‘‘యశోద ట్రైలర్‭కు మీ స్పందన బాగుంది. ముగింపులేని సవాళ్లు జీవితం ముందున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‭కు చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అయితే నేను అనుకున్న సమయం కంటే ఇది ఇంకా ఎక్కువ సమయమే తీసుకునేలా ఉంది. అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతీది స్వికరిస్తూనే పోరాటం చేస్తాను. నేను త్వరలోనే దీన్నుంచి కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి-చెడు రోజుల్ని చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరోనే ఉంది’’ అని ఇన్‭స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది సామ్. ఈ పోస్ట్ చివరలో ‘ఐ లవ్ యూ’ అంటూ రాసుకొచ్చింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘యశోద’, ‘ఖుషి’ అనే సినిమాల్లో సమంత నటిస్తోంది. సమంత తొందరలోనే అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ తన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్ని అలరించాలని పలువురు సెటెబ్రిటీలు కోరుతున్నారు.

Kangana Ranaut: రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. 2024లో పోటీపై స్పష్టతనిచ్చిన క్వీన్

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)