Kangana Ranaut: రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. 2024లో పోటీపై స్పష్టతనిచ్చిన క్వీన్

చాలా కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన మద్దతు ప్రకటిస్తున్న కంగనా.. రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీ తరపున పోటీ చేస్తారని చాలా కాలంగానే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన కంగనా.. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు, వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయదల్చుకున్నానో కూడా మనసులోని మాటను చెప్పేశారు.

Kangana Ranaut: రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. 2024లో పోటీపై స్పష్టతనిచ్చిన క్వీన్

Willing to fight 2024 Lok Sabha polls says Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రానున్నట్లే తెలుస్తోంది. చాలా కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన మద్దతు ప్రకటిస్తున్న కంగనా.. రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీ తరపున పోటీ చేస్తారని చాలా కాలంగానే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన కంగనా.. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు, వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయదల్చుకున్నానో కూడా మనసులోని మాటను చెప్పేశారు.

రాజకీయాల్లోకి రానున్నారా అని కంగనను ప్రశ్నించగా ‘‘నేను ఏదైనా ఓపెన్‭గా ఉంటాను. ఏదైనా ఉంటే వెంటనే చెప్పేస్తాను. రాజకీయాలు అంటే, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఆశీర్వదిస్తే మండి నుంచి ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుంది. కచ్చితంగా అది జరుగుతుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు. అంటే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కంగనా నేరుగానే చెప్పారు. ఇక ఆమె ఏ రాజకీయ పార్టీలో చేరతారనే దానిపై పెద్దగా చర్చ అనవవసరమనే అంటున్నారు. పక్కాగా బీజేపీ నుంచే 2024 ఎన్నికలో బరిలో కంగనా ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీని మహాపురుషుడితో పోలుస్తూ కంగనా ప్రశంసలు కురింపించారు. మోదీ, రాహుల్ గాంధీల గురించి ప్రశ్నించగా.. మోదీ, రాహుల్ ప్రత్యర్థులుగా ఉండడం బాధాకరమని, అయితే మోదీకి ప్రత్యర్థులే లేరని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కంగనా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ హామీల గురించి ప్రశ్నించగా.. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు కరెంట్ తామే తయారు చేసుకుంటారని, మహిళలు తామే కూరగాయలు పండించుకుంటారని, కాబట్టి కేజ్రీవాల్ ఇచ్చే ఉచితాలు వారికి అక్కర్లేదని కంగనా రనౌత్ అన్నారు.

Rajendra Pal Gautam: బాబాల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి