న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన అక్కినేని వారి కోడలు..

  • Published By: sekhar ,Published On : September 5, 2020 / 03:54 PM IST
న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన అక్కినేని వారి కోడలు..

Updated On : September 5, 2020 / 4:18 PM IST

Samantha Fashion Business: అక్కినేని వారి కోడ‌లు, స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని ఇప్పుడు సినిమాల‌తో పాటు వ్యాపార రంగంపై కూడా దృష్టి పెట్టారు. ఆమె ఇతర రంగాల్లో కూడా రాణించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.


ఇప్ప‌టికే జూబ్లీహిల్స్‌లో స్నేహితుల‌తో క‌లిసి ఏక్కం అనే ప్రీ స్కూల్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన స‌మంత త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల వ‌స్త్రాల‌కు సంబంధించిన వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు.


‘సాకి వ‌ర‌ల్డ్’(Saaki World) పేరుతో తాను దుస్తుల వ్యాపారంలోకి అడుగు పెట్ట‌బోతున్న‌ట్లు స‌మంత తెలిపారు. కొన్ని నెల‌లుగా సాకి వర‌ల్డ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాన‌ని.. నా జర్నీలో ఫ్యాషన్‌పై నాకున్న ప్రేమ‌ను సాకి వ‌ర‌ల్డ్ తెలియ‌జేస్తుంద‌ని సామ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా షేర్ చేసిన వీడియోలో ఫ్యాషన్‌ దుస్తులకు సంబంధించి డిజైన్స్‌ని దగ్గరుండి తయారు చేయిస్తూ కనిపించారు సమంత.