Samantha: దెయ్యాల కోటకి మహారాణి అవుతున్న సమంత..

ఏ మాయ చేశావే సినిమాతో కుర్రవాళ్ళ గుండెలోకి మహారాణిలా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఇప్పుడు దెయ్యాల కోటకి కూడా మహారాణిని అవుతానంటుంది. సౌత్ లో ఎన్నో హిట్స్ అందుకున్న సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి కెరీర్ నిర్మించుకునే పనిలో పడింది. ఆమె హాలీవుడ్ చిత్రం ‘సిటాడెల్‌’ హిందీ రీమేక్ లో నటిస్తుండగా, మరో క్రేజీ ఆఫర్ సమంత వద్దకు చేరింది.

Samantha: దెయ్యాల కోటకి మహారాణి అవుతున్న సమంత..

Samantha Doing Horror Movie

Updated On : September 17, 2022 / 3:38 PM IST

Samantha: ఏ మాయ చేశావే సినిమాతో కుర్రవాళ్ళ గుండెలోకి మహారాణిలా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఇప్పుడు దెయ్యాల కోటకి కూడా మహారాణిని అవుతానంటుంది. సౌత్ లో ఎన్నో హిట్స్ అందుకున్న సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి కెరీర్ నిర్మించుకునే పనిలో పడింది. వరుస పెట్టి వెబ్ సిరీస్, మూవీస్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.

Samantha: యశోద సినిమాకి సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

ఈ క్రమంలోనే “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో నటించి బాలీవుడ్ లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకి ఎన్నో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ చిత్రం ‘సిటాడెల్‌’ హిందీ రీమేక్ లో నటిస్తుండగా, మరో క్రేజీ ఆఫర్ సమంత వద్దకు చేరింది. దినేష్‌ విజన్‌ మ్యాడాక్‌ ఫిలింస్‌ సంస్థలో ఒక హారర్‌ కామెడీ సినిమా రాబోతుండగా సమంత నాయికగా ఎంపిక అయ్యింది.

ఈ హారర్ కామెడీ సినిమాలో సమంత మహారాణిలా కనిపించనుంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన హారర్ మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ నటుడు ‘ఆయుష్మాన్‌ ఖురానా’ వ్యాంపైర్‌గా కనిపిస్తుండగా, అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలోని సమంత యువరాణి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది.