×
Ad

Samantha : హమ్మయ్య ఎట్టకేలకు సమంత మొదలుపెడుతుంది.. చాన్నాళ్ల తర్వాత..

ఇటీవల శుభం సినిమాని నిర్మించి అందులో ఓ గెస్ట్ పాత్రని పోషించింది కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. (Samantha)

Samantha

Samantha : సమంత ప్రస్తుతం అడపాదడపా వెబ్ సిరీస్ లు చేస్తూ బిజినెస్ ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. గతంలో లాగా సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చెయ్యట్లేదు. ఇటీవల శుభం సినిమాని నిర్మించి అందులో ఓ గెస్ట్ పాత్రని పోషించింది కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆమె ఫ్యాన్స్ సమంత ఎప్పుడు మెయిన్ లీడ్ లో సినిమా చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు.(Samantha)

2024 ఏప్రిల్ లో సమంత మెయిన్ లీడ్ లో మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రకటించింది. సమంత సొంత నిర్మాణంలో ఓ కొత్త డైరెక్టర్ తో ఆ సినిమాని ప్రకటించింది. ఆ సినిమాని అనౌన్స్ చేస్తూ సమంత చీరకట్టుకొని గన్ పట్టుకొని ఉన్న ఓ మాస్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎదురుచూసారు. సినిమా అనౌన్స్ చేసి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇంకా ఆ సినిమా గురించి అప్డేట్ లేదు.

Also See : Mass Jathara : మాస్ జాతర నుంచి మెలోడీ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. భలే ఉందే..

ఎట్టకేలకు సమంత తాజాగా మా ఇంటి బంగారం సినిమా అప్డేట్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించగా ఓ అభిమాని తన నెక్స్ట్ సినిమాల గురించి అడిగాడు. దీనికి సమంత సమాధానమిస్తూ.. ఫైనల్లీ ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. మా ఇంటి బంగారం ఈ నెలలో మొదలుకాబోతుంది అని తెలిపింది. ఈ లెక్కన మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే సమంత మా ఇంటి బంగారం సినిమా కొత్త డైరెక్టర్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ ని తప్పించి తన ఫ్రెండ్ నందిని రెడ్డికి సినిమా అప్పగించింది సమంత. దీంతో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. నందిని రెడ్డి గతంలో సమంతతో ఓ బేబీ సినిమా చేసింది. అదే ఆమెకు చివరి హిట్ సినిమా. సమంత కూడా హిట్ చూసి చాలా కాలం అయింది. దీంతో మా ఇంటి బంగారం సినిమా సమంత, నందిని రెడ్డి ఇద్దరికీ కీలకంగా మారింది.

Also Reda : Ravi K Chandran : ఓజీ రిలీజ్ తర్వాత అకిరా నందన్ నాకు ఫోన్ చేసి.. ఓజీ సినిమాటోగ్రాఫర్ కామెంట్స్ వైరల్..