ఫస్ట్ టైం : ప్రభాస్ తో సమంత జోడీ

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 06:23 AM IST
ఫస్ట్ టైం : ప్రభాస్ తో సమంత జోడీ

Updated On : April 3, 2019 / 6:23 AM IST

పలనా హీరో.. పలానా డైరెక్టర్ తో సినిమా చేయాలి. ఆ హీరోయిన్.. ఈ హీరోతో సినిమా చేస్తే సూపర్ ఉంటుంది. ఈ ఇద్దరు హీరోలు అన్నదమ్ముల్లా నటిస్తే అదిరిపోతుంది. ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రీమ్ కాంబినేషన్స్ ఆడియన్స్ ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. అలాంటి ఓ అందమైన కాంబినేషనే.. ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ స్పీడ్ పెంచాడు. సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్లో నటిస్తున్నాడు. వీటితోపాటు మరో మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాడు.

రాధాకృష్ణ సినిమా పూర్తికాగానే.. ప్రభాస్, దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నాడు బహుబలి. ఈ మూవీలోనే క్యూట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు సినీ ఇండస్ట్రీ టాక్. ఇదే జరిగితే ఫస్ట్ టైం ప్రభాస్ – సమంత జోడీ అవుతుంది. రీసెంట్ గా 96 రీమేక్ కోసం సమంతాని కలిసిన దిల్ రాజు.. ప్రభాస్ తో సినిమా గురించి చర్చించినట్లు టాక్. గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందంట.

టాలివుడ్ లో మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించిన సమంత.. ఒక్క ప్రభాస్ తో నటించలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకుంది అక్కినేని కోడలు అంటున్నారు సినీ అభిమానులు. ఆల్రెడీ దిల్ రాజు, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు హిట్.. రాబోయేది హ్యాట్రిక్ అంటోంది ఇండస్ట్రీ.