Samantha : చిన్నప్పుడు అలా చేశాను.. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..
సమంత హెల్త్ పాడ్‌కాస్ట్ ని మొదలుపెట్టబోతున్నాను, త్వరలోనే వాటితో మీ ముందుకి వస్తాను, అవి మీ అందరికి ఉపయోగపడతాయి అని ఇటీవల చెప్పింది.

Samantha Interesting Post on her upcoming Health Podcast
Samantha : సమంత తన హెల్త్ మీద ఫోకస్ చేయడానికి కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయి మళ్ళీ వర్క్స్ మొదలుపెడుతుంది సామ్. ఇటీవల సిటాడెల్ సిరీస్ కి డబ్బింగ్ పూర్తి చేసిన సమంత త్వరలోనే పాడ్ కాస్ట్ లతో రాబోతున్నాను అని ప్రకటించింది.
సమంత హెల్త్ పాడ్‌కాస్ట్ ని మొదలుపెట్టబోతున్నాను, త్వరలోనే వాటితో మీ ముందుకి వస్తాను, అవి మీ అందరికి ఉపయోగపడతాయి అని ఇటీవల చెప్పింది. తాజాగా పాడ్ కాస్ట్ రికార్డింగ్ చేస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికర పోస్ట్ చేసింది.
Also Read : Allari Naresh : పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రాబోతున్న అల్లరి నరేష్.. అల్లరోడికి వర్కౌట్ అవుతుందా?
సమంత తన పాడ్ కాస్ట్ రికార్డింగ్ ఫొటోని షేర్ చేసి.. చిన్నప్పుడు నేను సిలబస్ కాకుండా వేరే పుస్తకాలు కూడా చదివేదాన్ని. వాటి గురించి రీసెర్చ్ చేసి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేదాన్ని. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఆ పట్టుదల మళ్ళీ నాలో ఉందని రియలైజ్ అయ్యాను. నేను రీసెర్చ్ చేసి నా నోట్ బుక్స్ అన్ని నింపేస్తున్నాను. ఇవన్నీ మీకు షేర్ చేయడానికి ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. దీంతో సమంత తాను చేయబోయే హెల్త్ పాడ్ కాస్ట్ కోసం చాలా రీసెర్చ్ చేసి చేస్తుందని తెలుస్తుంది.