Samantha : ‘చిన్మయి పాపా.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా..’ సమంత
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టూ చేస్తూ చిన్మయి పాపా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఖుషి మ్యూజికల్ నైట్‌లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. నీ మాటలతో ఆ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది.
Samantha praises Chinmayi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఖుషి సినిమా ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ను నిర్వహించింది. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ లోని HICC కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది.
Bedurulanka 2012 Trailer : రామ్ చరణ్ చేతులు మీదగా రిలీజైన బెదురులంక 2012 ట్రైలర్..
విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్సులు చేసి అభిమానులను అలరించగా సింగర్ చిన్మయి (Chinmayi) పాల్గొని మధురమైన పాటలు పాడింది. అనంతరం చిన్మయి మాట్లాడుతూ.. సమంతతో ఎప్పటి నుంచో ఓ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తెలుగులో తన డబ్బింగ్ కెరీర్ సామ్ వల్లే మొదలైందని చెప్పింది. సామ్ ఎంతో మందిలో స్పూర్తి నింపిందని, ఈ ప్రపంచంలో మంచి మనస్సు, ధైర్యవంతులైన, అందమైన వ్యక్తుల్లో ఆమె ఒకరు అని అంది. ఎవ్వరు ఎమన్నా సరే సామ్ ఎప్పటికీ బెస్టే అని తెలిపింది.
Celebrity Look : అందాల భామల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. వారసులతో స్టార్ హీరోల జెండా వందనం..
అంతేకాదు ‘అమృత’లోని “ఏ దేవి వరము నీవో” అనే సాంగ్‌ను పాడి సమంతకు డెడికేట్ చేసింది. చిన్మయి మాట్లాడుతుండగా పక్కనే పక్కన సమంత కాసింత భావోద్వేగానికి గురై ఆమెను కౌగిలించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇదే వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టూ చేస్తూ..” చిన్మయి పాపా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఖుషి మ్యూజికల్ నైట్‌లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. నీ మాటలతో ఆ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. నీ మనసు ఎంత అందంగా ఉంటుందో అంతటి మధురమైన గాత్రాన్ని ఆ భగవంతుడు నీకు ఇచ్చాడు.” అంటూ సమంత రాసుకొచ్చింది.
కాగా.. సమంత, చిన్మయిలు ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.