Samantha Shares a Post about her Skin Health Care Photos goes Viral
Samantha : సమంత ఆరోగ్యం కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకొని మళ్ళీ సినిమాలు, సిరీస్ లు మొదలుపెడుతుంది. ఒక సంవత్సరం నుంచి సమంత తన హెల్త్ కోసం, అందం కోసం రకరకాల చికిత్సలు తీసుకుంటుంది. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి పోస్టులు కూడా చేస్తుంది. ఓ హెల్త్ పాడ్ కాస్ట్ కూడా చేస్తుంది.
తాజాగా సమంతా తన చర్మ సౌందర్యం కోసం, చర్మ ఆరోగ్యం కోసం ఏమేం చేస్తుందో రకరకాల చికిత్సలు తీసుకుంటున్న పలు ఫొటోలు షేర్ చేస్తూ తన సోషల్ మీడియాలో తెలిపింది.
Also Read : Pawan Kalyan – Vaibhav : పవన్ కళ్యాణ్ కర్ర పట్టుకొని మమ్మల్ని భయపెట్టారు.. హీరో వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సమంత తన పోస్ట్ లో.. చాలామంది నా ఫేస్ ఎలా మెరుస్తుంది, ఇంత అందంగా ఎలా మెయింటైన్ చేస్తుంటారు అని అడుగుతుంటారు? నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాడిన మందులతో నా చర్మం కూడా ఇబ్బంది పడింది. పిగ్మెంటేషన్, డ్రైనెస్, పఫ్నెస్.. ఇలాంటి పలు సమస్యలు చూసాను. దీంతో నా చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోడానికి మందులు లేని మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నాను. అందుకే పికో లేజర్, రెడ్ లైట్ థెరపీ, ఫిషియల్స్.. ఇలా పలు పద్ధతులు వాడుతున్నాను. మొదట్లో నేను నా చర్మం గురించి ఎక్కువగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ నాకు తర్వాత అర్థమైంది. స్కిన్ గురించి పట్టించుకోవడం అంటే అందం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. మీరు కూడా చర్మ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అలాగే సూర్య రష్మీ, హైడ్రేషన్, మంచి పౌష్టికాహారం లాంటి బేసిక్ పద్ధతులు కూడా చర్మ సౌందర్యం కోసం పాటించండి అని తెలిపింది.
దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది. చర్మ సౌందర్యం కోసం చికిత్స చేసుకుంటున్న ఫోటోలు చూసి చర్మ సౌందర్యం కోసం సమంత మరీ ఇంత కష్టపడుతుందా అని అంతా భావిస్తున్నారు.