Pawan Kalyan – Vaibhav : పవన్ కళ్యాణ్ కర్ర పట్టుకొని మమ్మల్ని భయపెట్టారు.. హీరో వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
నటుడు వైభవ్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Actor Vaibhav Shares Interesting Incident with Pawan Kalyan
Pawan Kalyan – Vaibhav : సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విజయ్ Goat సినిమాలో కనపడ్డాడు. తాజాగా సోని ఓటీటీలో బెంచ్ లైఫ్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటుడు వైభవ్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబోలో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలా ఓ సినిమా షూటింగ్ కి వైభవ్, పలువురు పిల్లలు, పవన్ కళ్యాణ్ కూడా కశ్మీర్ కి వెళ్తే అక్కడ జరిగిన సంఘటనను వైభవ్ తెలిపాడు.
వైభవ్ మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు ఓ సినిమా షూటింగ్ లో చిరంజీవి గారు, డాడీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అప్పుడు పదిమంది పిల్లలం మేము అల్లరి చేస్తున్నాము. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక కర్ర ఇచ్చి మమ్మల్ని చూసుకోమన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు ఆ కర్ర చూపిస్తూ మమ్మల్ని భయపెట్టారు. ఐస్ క్రీం కొనుక్కుంటాం అంటే కశ్మీర్ లో ఐస్ క్రీం ఏంట్రా అని తిట్టారు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు లీడర్ క్వాలిటీస్ ఇచ్చేసారు అని తెలిపాడు. ఇలా వైభవ్ చిన్నప్పుడు జరిగిన సరదా సన్నివేశాన్ని పంచుకోవడంతో పవన్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు.
Actor vaibhav shares his funny childhood memory with @PKCreativeWorks pic.twitter.com/QwsohHlDu3
— Bhagat (@Only_PSPK) September 13, 2024