Nani – Vijay Devarakonda : ఇకపై నానిని అన్న అని పిలుస్తాను.. విజయ్ వ్యాఖ్యలు.. నాని – విజయ్ వివాదం ముగిసినట్టేనా..?
ఇటీవల నాని - విజయ్ మధ్య ఎలాంటి వివాదాలు, విబేధాలు లేవని ఇద్దరూ కలిసి క్లారిటీ ఇస్తున్నారు.

No issues Between Nani and Vijay Devarakonda Nani Received SIIMA Best Actor Award from Vijay
Nani – Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు నాని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే పేరొచ్చింది. ఆ సినిమాలో నాని – విజయ్ కలిసి నటించారు. ఆ తర్వాత విజయ్ హీరో అయ్యాడు. అయితే విజయ్ హీరో అయ్యాక కొంతమంది విజయ్ ఫ్యాన్స్ నానిపై విమర్శలు చేసారు. విజయ్ కి కూడా నానితో విబేధాలు వచ్చాయని టాక్ రావడంతో నాని ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండపై విమర్శలు చేసారు. దీంతో కొన్నాళ్లుగా నాని – విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. దీంతో నాని – విజయ్ మధ్య కూడా మనస్పర్థలు ఉన్నాయని అంతా భావించారు.
అయితే ఇటీవల నాని – విజయ్ మధ్య ఎలాంటి వివాదాలు, విబేధాలు లేవని ఇద్దరూ కలిసి క్లారిటీ ఇస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన బాలకృష్ణ 50 ఏళ్ళ నట వేడుకల్లో నాని విజయ్ దేవరకొండ స్టేజి మీద హగ్ చేసుకొని మాట్లాడటం వైరల్ అయింది. తాజాగా మరోసారి నాని – విజయ్ దేవరకొండ వైరల్ గా మారారు.
నిన్న దుబాయ్ లో సైమా అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకల్లో నానికి బెస్ట్ యాక్టర్ అవార్డు దసరా సినిమాకు గాను అందుకున్నాడు. అయితే ఈ అవార్డుని విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఇప్పించారు. నాని స్టేజిపై రాగానే ముందుగా విజయ్ ని హత్తుకున్నాడు. అవార్డు ఇచ్చేముందు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా హీరో. నాగ్ అశ్విన్ పిలిచి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చి నాని ఆఫీస్ కి వెళ్ళినప్పుడు నాని ఎలా మాట్లాడతాడో అనుకున్నా. కానీ నాని నాకు చాలా సపోర్ట్ చేసాడు ఆ సినిమాలో. ఇండస్ట్రీలో అందరూ అందర్నీ అన్న అని పిలుస్తూ ఉంటారు. ఎందుకో అర్ధం కాదు. కానీ ఇవాళ్టి నుంచి నేను కూడా నానిని అన్న అనే పిలుస్తాను అని అన్నాడు.
అనంతరం నాని అవార్డు తీసుకున్న తర్వాత మాట్లాడుతూ.. సినిమా అంతా ఒక సర్కిల్. ఇవాళ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం షూట్ సమయంలో చాలా డౌట్స్ అడిగేవాడు. చాలా నేర్చుకునేవాడు. కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. ఇవాళ నువ్వు నాకు అవార్డు ఇచ్చావు, నెక్స్ట్ ఇయర్ గౌతమ్ సినిమాకు నేను నీకు అవార్డు ఇస్తాను అని అన్నారు. దీంతో నాని, విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా వీరిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని క్లారిటీ వచ్చేసింది అంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ స్పీచ్ ల తర్వాత ఫ్యాన్ వార్స్ ఆపేస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.