Chiranjeevi – Mathu Vadalara 2 : ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా చూడలేదు.. మత్తు వదలరా 2 పై మెగాస్టార్ రివ్యూ..

ఇటీవల మహేష్ బాబు మత్తు వదలరా 2 సినిమాపై అదిరిపోయింది అంటూ రివ్యూ ఇవ్వగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మత్తు వదలరా 2 సినిమాని పొగుడుతూ ట్వీట్ చేసారు.

Chiranjeevi – Mathu Vadalara 2 : ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా చూడలేదు.. మత్తు వదలరా 2 పై మెగాస్టార్ రివ్యూ..

Megastar Chiranjeevi Super Review on Mathu Vadalara 2 Movie

Updated On : September 15, 2024 / 9:35 AM IST

Chiranjeevi – Mathu Vadalara 2 : శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 ఇటీవల సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్ ని ఫుల్ గా నవ్విస్తుంది. ఇప్పటికే మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా అదరగొడుతుంది. ఇక మత్తు వదలరా 2 సినిమాకు సినీ పరిశ్రమ నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి.

ఇటీవల మహేష్ బాబు మత్తు వదలరా 2 సినిమాపై అదిరిపోయింది అంటూ రివ్యూ ఇవ్వగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మత్తు వదలరా 2 సినిమాని పొగుడుతూ ట్వీట్ చేసారు. మత్తు వదలరా సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల రిఫరెన్సులు బాగా వాడారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కూడా సినిమాలో తన రిఫరెన్స్ లు చూసి ఆనందించి ఉంటారు.

Also Read : Shekar Basha : బిగ్ బాస్ హౌస్ నుంచి.. అప్పుడే శేఖర్ బాషాని పంపించేస్తున్నారా?

చిరంజీవి తన ట్వీట్ లో.. నిన్ననే ‘మత్తు వదలరా – 2’ చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్ టైటిల్స్ ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రానాకి ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. హాట్స్ ఆఫ్ రితేష్ రానా. నటీ నటులకు, సింహ, ప్రత్యేకించి సత్యకి నా అభినందనలు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాల భైరవలకు, మంచి విజయాన్ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు, టీం అందరికీ నా అభినందనలు. అస్సలు మిస్ అవ్వకండి మత్తు వదలరా 2 సినిమా వంద శాతం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ అని రాసుకొచ్చారు. మెగాస్టార్ ఈ రేంజ్ లో రివ్యూ ఇచ్చి, అస్సలు మిస్ అవ్వకండి అంటూ ట్వీట్ చేయడంతో మత్తు వదలరా 2 సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది.