Samantha Special Pooja at Linga Bhairavi Temple in Isha Foundation Photo goes Viral
Samantha : సమంత ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఓ పక్క సినిమాలు, సిరీస్ లతో పాటు మరో పక్క తన బిజినెస్ లతో బిజీగా ఉంది. తాజాగా సమంతా మరోసారి ఈషా ఫౌండేషన్ కు వెళ్ళింది. సమంత కు మయోసైటిస్ వచ్చినప్పటినుంచి రెగ్యులర్ గా ఈషా ఫౌండేషన్ కి వెళ్తూ, అక్కడ పూజలు, ధ్యానం చేస్తూ గడుపుతుంది.
Also Read : Devara : దేవర ప్రీ ప్రొడక్షన్ ఎన్టీఆర్ స్కెచెస్ చూసారా..? ‘దేవర’కు ప్రీ వర్క్ బాగానే చేసుకున్నారుగా..
అప్పుడప్పుడు ఈషా ఫౌండేషన్ నుంచి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా దసరా నవరాత్రుల సందర్భంగా సమంత మరోసారి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది. అక్కడ ఈషా ఫౌండేషన్ లో ఉండే లింగ భైరవి దేవి ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు చేసింది. లింగ భైరవి అమ్మవారికి నమస్కరిస్తున్న ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో దసరా నవరాత్రులు సమంత అక్కడే జరుపుకోవచ్చు అని భావిస్తున్నారు.