Samantha : కొత్త వర్క్ మొదలుపెడుతున్న సమంత.. మీకోసం హెల్త్ అంటూ ఆ రూపంలో..

సమంత హీరోయిన్ గా మాత్రం ఇప్పట్లో సినిమాలు వచ్చేలా కనపడట్లేదు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత ఓ వీడియోని పోస్ట్ చేసింది.

Samantha Starting New Work Shares a Video Full Details Here

Samantha : సమంత తన హెల్త్ మీద ఫోకస్ చేయడానికి కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన బిజినెస్ లను చూసుకుంటూ గడిపేస్తుంది సమంత. ఇటీవల సిటాడెల్ సిరీస్ కి డబ్బింగ్ చెప్పడంతో సమంత మళ్ళీ సినిమా వర్క్ మొదలుపెట్టింది అనుకున్నారు అంతా. కానీ కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదు. సిటాడెల్ వర్క్ పూర్తవ్వడంతో త్వరలోనే ఈ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని తెలుస్తుంది.

ఇక నిర్మాతగా కూడా సమంత ఓ నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు తీయబోతున్నాను అని ప్రకటించింది. సమంత హీరోయిన్ గా మాత్రం ఇప్పట్లో సినిమాలు వచ్చేలా కనపడట్లేదు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత ఓ వీడియోని పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ .. నేను మళ్ళీ వర్క్ చేయబోతున్నాను. ఒక హెల్త్ పాడ్‌కాస్ట్ ని మొదలుపెట్టబోతున్నాను. ఇది ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఇది నేను ఇష్టపడి చేయాలనుకుంటున్నాను. వచ్చే వారం నుంచి ఈ హెల్త్ పాడ్‌కాస్ట్‌లు(Health Podcast) రిలీజ్ అవుతాయి. మీలో చాలామందికి ఇవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ పాడ్‌కాస్ట్ చేయడంలో నేను చాలా ఆనందించాను అని తెలిపింది.

Also Read : Prasanth Varma : ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయి బ్రో నీలో.. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తను చదివిన స్కూల్ లో..

దీంతో ఇలా అయిన అభిమానులకు దగ్గరవుతుందని కొంతమంది భావిస్తుంటే సినిమాల్లో ఎప్పుడు కనపడుతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ హెల్త్ పాడ్‌కాస్ట్ లో తను ఇన్నాళ్లు నేర్చుకున్నవి, ట్రీట్మెంట్స్, మానసిక, శారీరక ఆరోగ్యాల గురించి చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల పాడ్‌కాస్ట్ లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. మరి సమంత హెల్త్ పాడ్‌కాస్ట్ లు ఎలా ఉంటాయో చూడాలి.