Prasanth Varma : ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయి బ్రో నీలో.. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తను చదివిన స్కూల్ లో..

హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మలో రైటర్, దర్శకుడు మాత్రమే కాకుండా ఇంకా చాలా ట్యాలెంట్స్ ఉన్నాయి.

Prasanth Varma : ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయి బ్రో నీలో.. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తను చదివిన స్కూల్ లో..

Hanuman Movie Director Prasanth Varma Showing his Talents one by one New Video goes Viral

Updated On : February 11, 2024 / 5:10 PM IST

Prasanth Varma : హనుమాన్(Hanuman) సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదటి నుంచి కూడా కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పిస్తున్నాడు. ఇప్పుడు హనుమాన్ సినిమాతో భారీ విజయం సాధించి దేశమంతటా పాపులర్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ భారీ సక్సెస్ తో తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొనేలా చేసాడు.

అయితే ప్రశాంత్ వర్మలో రైటర్, దర్శకుడు మాత్రమే కాకుండా ఇంకా చాలా ట్యాలెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ ప్రొఫెషనల్ క్రికెటర్(Cricketer) అని తెలిసిందే. స్కూల్, కాలేజీ లెవెల్స్ నుంచి ప్రశాంత్ క్రికెట్ ఆడుతూ డిస్ట్రిక్ లెవల్ లో పలు కప్పులు గెలుచుకున్నాడు. ఇప్పుడు కూడా అనేక టోర్నమెంట్స్ లో క్రికెట్ ఆడుతున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. బ్యాడ్మింటన్ లోనూ పలు టోర్నమెంట్స్ లో పాల్గొన్నాడు.

Also Read : SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమాలో ఇండోనేషియన్ నటి? నిజమేనా? ప్రూఫ్ ఇదేనా?

తాజాగా ప్రశాంత్ వర్మ తనలోని మరో ట్యాలెంట్ ని బయటపెట్టాడు. ప్రశాంత్ డ్రమ్స్ కూడా వాయిస్తాడని తను షేర్ చేసిన ఓ వీడియోతో తెలిసింది. ప్రశాంత్ వర్మ చిన్నప్పుడు శిశుమందిర్ స్కూల్ లో చదువుకున్నాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ స్కూల్ ఈవెంట్ కి ప్రశాంత్ వర్మ హాజరయ్యాడు. అంతేకాకుండా అక్కడ ఓ స్టూడెంట్ తో పాటు డ్రమ్స్ వాయించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నీలో ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయి బ్రో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.