SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమాలో ఇండోనేషియన్ నటి? నిజమేనా? ప్రూఫ్ ఇదేనా?
రాజమౌళి ఆల్రెడీ RRR సినిమాలో కథకు తగ్గట్టు వేరే దేశాల యాక్టర్స్, హీరోయిన్ ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు SSMB29 సినిమాలో కూడా ఓ ఇండోనేషియా యాక్ట్రెస్ ని తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Indonesia Actress Chelsea Elizabeth Islan will Play Key Role in Mahesh Babu Rajamouli SSMB29 Movie Rumours Goes Viral
SSMB 29 Movie : RRR సినిమా తర్వాత రాజమౌళి(Rajamouli) మహేష్ బాబుతో(Mahesh Babu) సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి – మహేష్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఆల్రెడీ గతంలోనే రాజమౌళి(Rajamouli) చెప్పారు. ఇక ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
మహేష్ బాబు కూడా కొన్ని రోజుల క్రితమే జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకొని వచ్చారు. ప్రస్తుతం ఫుల్ జుట్టు, గడ్డం ఉన్న మహేష్ కొత్త లుక్ కూడా వైరల్ అవుతుంది. ఈ సినిమా గురించి రోజూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా మహేష్ – రాజమౌళి సినిమాకి సంబంధించి ఓ వార్త నేషనల్ వైడ్ వైరల్ అవుతుంది.
గతంలోనే విజయేంద్రప్రసాద్ ఈ సినిమాలో వేరే దేశాల యాక్టర్స్ కూడా ఉంటారు అని చెప్పారు. రాజమౌళి ఆల్రెడీ RRR సినిమాలో కథకు తగ్గట్టు వేరే దేశాల యాక్టర్స్, హీరోయిన్ ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు SSMB29 సినిమాలో కూడా ఓ ఇండోనేషియా యాక్ట్రెస్ ని తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామ రాజమౌళి – మహేష్ సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.
Also Read : Nani – Sandeep Vanga : నానితో కలిసి ట్రావెల్ చేస్తున్న సందీప్ వంగ.. ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..
అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా నేషనల్ వైడ్ ఈ వార్త వైరల్ అవుతుంది. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ పలు హాలీవుడ్, కొరియన్, ఇండోనేషియన్ సినిమాల్లో నటించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో రాజమౌళిని ఫాలో అవ్వడం గమనార్హం. దీంతో కచ్చితంగా రాజమౌళి ఆమెని అప్రోచ్ అయి ఉంటాడు, ఆమె ఓకే చెప్పింది అందుకే రాజమౌళిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇది జస్ట్ రూమర్ అని కొట్టిపారేస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు రాజమౌళి SSMB29 సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు.