Nani – Sandeep Vanga : నానితో కలిసి ట్రావెల్ చేస్తున్న సందీప్ వంగ.. ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..

సందీప్ తో ఏ హీరో కనపడినా ఆ హీరోతో ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంటున్నారు.

Nani – Sandeep Vanga : నానితో కలిసి ట్రావెల్ చేస్తున్న సందీప్ వంగ.. ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..

Nani and Sandeep Reddy Vanga Travelled together Photos and Videos goes Viral

Updated On : February 11, 2024 / 3:41 PM IST

Nani – Sandeep Vanga : అర్జున్ రెడ్డి సినిమాతోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అందరి కళ్ళల్లో పడ్డాడు అనుకుంటే ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి కబీర్ సింగ్, ఇటీవల యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. యానిమల్ సినిమా భారీ విజయం సాధించడంతో సందీప్ వంగ సినిమాలపై ఆసక్తి నెలకొంది. యానిమల్ తర్వాత అల్రెడే సందీప్ వంగ మూడు ప్రాజెక్ట్స్ ని ఓకే చేసుకున్నాడు.

సందీప్ వంగ చేతిలో యానిమల్(Animal) సీక్వెల్, ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో ఒక సినిమా ఉన్నాయి. చిరంజీవి ఛాన్స్ ఇస్తే ఆయనతో కూడా ఒక సినిమా చేస్తా అన్నాడు. ఇక సందీప్ వంగతో సినిమాలు చేయడానికి టాలీవుడ్, బాలీవుడ్ హీరోలంతా ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్ తో ఏ హీరో కనపడినా ఆ హీరోతో ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంటున్నారు.

Also Read : Samyuktha : గుర్రమెక్కిన సక్సెస్‌ఫుల్ హీరోయిన్.. ఆ సినిమా కోసం కష్టపడుతూ..

తాజాగా నాని, సందీప్ వంగ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనపడ్డారు. గతంలో వీరిద్దరూ కలిసి యానిమల్, హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు చూసి నానితో సందీప్ వంగ ఏం ప్లాన్ చేస్తున్నాడో అనుకుంటున్నారు నెటిజన్లు. అయితే వీరిద్దరూ చెన్నైలో జరిగే బిహైండ్ వుడ్ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్తున్నట్టు, ఆ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో కలిసి వెళ్లినట్టు తెలుస్తుంది.