Samyuktha : గుర్రమెక్కిన సక్సెస్‌ఫుల్ హీరోయిన్.. ఆ సినిమా కోసం కష్టపడుతూ..
నిఖిల్ స్వయంభు సినిమాలో కూడా సంయుక్త మీనన్ నటిస్తుంది. అయితే ఈ సినిమా కోసం సంయుక్త కూడా గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను సంయుక్త తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Samyuktha Menon Learning Horse Riding for her upcoming film Swamyambhu
Samyuktha Menon : నిఖిల్(Nikhil Siddhartha) కార్తికేయ 2 సినిమా తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ‘స్వయంభు'(Swayambhu) అనే సినిమాతో రాబోతున్నాడు. హిస్టారికల్ కథతో ఈ సినిమా భారీగా ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం నిఖిల్ కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు నేర్చుకున్నాడు. స్వయంభు రాజుల కాలం నాటి కథలా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మలయాళీ భామ సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బింబిసార, విరూపాక్ష, డెవిల్ సినిమాలతో వరుస హిట్స్ కొట్టింది. ఇప్పుడు నిఖిల్ స్వయంభు సినిమాలో కూడా సంయుక్త మీనన్ నటిస్తుంది. అయితే ఈ సినిమా కోసం సంయుక్త కూడా గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను సంయుక్త తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read : Rajamouli : మురళీమోహన్ పై రాజమౌళి వ్యాఖ్యలు.. చిన్నప్పుడు ఆయన మాకు శత్రువు అంటూ..
గుర్రంపై కూర్చొని ఉన్న ఫొటోలను షేర్ చేసిన సంయుక్త.. 2024లో నా జీవితాన్ని మార్చేసే అనేక విషయాలు నేర్చుకుంటున్నాను. కంఫర్ట్ జోన్ లో నేను ఎప్పుడూ లేను. ఇలాంటి కొత్త అనుభవాలను వెతుకుతాను. నా రాబోయే సినిమా స్వయంభు కోసం గుర్రపుస్వారీ నేర్చుకున్నాను. ఇది నాకు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతని ఇస్తుంది. గుర్రంతో నేను మాట్లాడుతున్నాను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో స్వయంభు సినిమాలో సంయుక్తకి కూడా యుద్దపు సన్నివేశాలు ఉండొచ్చు అని తెలుస్తుంది. వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ ఈ సినిమాతో కూడా హిట్ కొడుతుందని భావిస్తున్నారు.