Rajamouli : మురళీమోహన్ పై రాజమౌళి వ్యాఖ్యలు.. చిన్నప్పుడు ఆయన మాకు శత్రువు అంటూ..
ఇదే ఈవెంట్ కి దర్శకుడు రాజమౌళి కూడా హాజరవగా ఆయన మాట్లాడుతూ మురళీమోహన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rajamouli sensational comments on Senior Actor Murali Mohan in 50 years Golden Jubilee Event
Rajamouli : సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్(Murali Mohan) నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో నిన్న ఫిబ్రవరి 10న సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ కి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణంరాజు సతీమణి, రఘురామ కృష్ణంరాజు, సుజనా చౌదరి, కోటా శ్రీనివాసరావు, కీరవాణి, రాజమౌళి, అశ్వనీదత్.. తదితరులు హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో ప్రముఖులంతా మురళీ మోహన్ గురించి మాట్లాడుతూ అభినందించారు. ఆయనతో తమకున్న అనుబంధం, ఆయన సినిమాల గురించి మాట్లాడారు. ఇదే ఈవెంట్ కి దర్శకుడు రాజమౌళి కూడా హాజరవగా ఆయన మాట్లాడుతూ మురళీమోహన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : OG Movie : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో ఓజి నిర్మాత ఫన్నీ చాటింగ్.. వైరల్ అవుతున్న ట్వీట్స్..
రాజమౌళి మాట్లాడుతూ.. నా వయసు 50 ఏళ్ళు. ఆయన సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు. ఆయన గురించి నేనేం చెప్తా. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ ని నేను. ఆయన తీసే మాస్ సినిమాలకు వెళ్ళాలి అనుకునేవాడిని. కానీ మా అమ్మ, పెద్దమ్మ వాళ్లంతా, లేడీస్ చాలామంది మురళీ మోహన్ ఫ్యాన్స్. వాళ్లేమో మురళీ మోహన్ సినిమాలకు తీసుకెళ్ళేవాళ్ళు. ఎన్టీఆర్ సినిమాలని ఒక్కసారి చూస్తే మురళీ మోహన్ సినిమాలని రెండు, మూడు సార్లు చూసేవాడిని. అంత లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అప్పట్లో ఆయనకు. చిన్నప్పుడు ఆయన మాకు పెద్ద శత్రువు. మమ్మల్ని ఎన్టీఆర్ సినిమాకు కాదని, మురళీ మోహన్ సినిమాలకు తీసుకెళ్ళేవాళ్ళు అని కోపం. కానీ ఆయన గొప్పతనం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తెలిసింది. నటుడిగానే కాదు నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. 25 సినిమాలు తీస్తే అందులో దాదాపు 23 సినిమాలు హిట్ అయ్యాయి. కానీ తనకి నచ్చినట్టు సినిమా నిర్మాణం జరగట్లేదని నిర్మాతగా తప్పుకున్నారు. ఆయన అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.