Samantha – Ali Fazal : మీర్జాపూర్ గుడ్డు భాయ్‌తో సమంత.. వెబ్ సిరీస్ కోసం..

తాజాగా సమంత నెట్ ఫ్లిక్స్ కి చెందిన ఓ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్టు సమాచారం.

Samantha – Ali Fazal : మీర్జాపూర్ గుడ్డు భాయ్‌తో సమంత.. వెబ్ సిరీస్ కోసం..

Samantha will acting with Mirzapur Fame Ali Fazal for Netflix Series

Updated On : July 25, 2024 / 9:42 AM IST

Samantha – Ali Fazal : సమంత మయోసైటిస్ వచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మళ్ళీ సినిమాలు, సిరీస్ లు మొదలుపెడుతుంది. సమంత నటించిన సిటాడెల్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇటీవల మా ఇంటి బంగారం అనే సినిమా కూడా అనౌన్స్ చేసింది. తాజాగా సమంత నెట్ ఫ్లిక్స్ కి చెందిన ఓ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్టు సమాచారం.

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో సమంతకు బాలీవుడ్ లో మార్కెట్ వచ్చింది. ఈ సిరీస్ ని డైరెక్ట్ చేసిన రాజ్ & డీకే సమంతకు బాగా క్లోజ్ అయ్యారు. రాజ్ & డీకే నిర్మాతలుగా, దర్శకులుగా పలు సిరీస్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ కి రాజ్ & డీకే నిర్మాణంలో తంబాడ్ సినిమా ఫేమ్ డైరెక్టర్ రవి అనిల్ బర్వె దర్శకత్వంలో ఓ సిరీస్ ప్లాన్ చేసారు. ఆ సిరీస్ కోసం మీర్జాపూర్ లో గుడ్డు భాయ్ క్యారెక్టర్ తో ఫేమ్ తెచ్చుకున్న అలీ ఫజల్, సమంతలను మెయిన్ లీడ్స్ గా ఎంపిక చేసినట్టు సమాచారం.

Also Read : Vishwak Sen : రీల్స్‌కి అందరూ అడిక్ట్ అయిపోయారు.. సోషల్ మీడియా అడిక్షన్ పై విశ్వక్ సంచలన వ్యాఖ్యలు..

ఇందుకు సమంత కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో మీర్జాపూర్ గుడ్డు భాయ్ పక్కన సమంత నటించబోతుందని తెలిసి అలీ ఫజల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సిరీస్ కి రక్త్ బ్రహ్మాండ అని టైటిల్ పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లోనే సమంత ఓ రేంజ్ లో నటించింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అంటే సమంత ఇంకే రేంజ్ లో అవుట్ పుట్ ఇస్తుందో చూడాలి.