Site icon 10TV Telugu

Samantha : వాట్.. సమంత మళ్ళీ ఐటెం సాంగ్ చేస్తుందా.. గ్లోబల్ స్టార్ సినిమాలో..?

Samantha will do another Special Song in Ram Charan Peddi Movie Rumors goes Viral

Samantha

Samantha : స్టార్‌ హీరోయిన్‌ సమంత మునుపటిలా సినిమాలు చేయడం లేదు. కొత్త ప్రాజెక్ట్స్‌ ఎప్పుడు సైన్‌ చేస్తుందా అని ఈగర్‌గా ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత చేతిలో ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్, మా ఇంటి బంగారం అనే సినిమా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సమంత గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా పెద్ది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయబోతుందనే న్యూస్‌ ఫిల్మ్‌సర్కిల్లో వైరలవుతోంది. ఆల్రెడీ రంగస్థలం సినిమాలో రామ్‌ చరణ్‌తో జోడీకట్టి మెగా ఫ్యాన్స్‌ని అలరించింది సమంత. పుష్పలో అల్లు అర్జున్‌తో సామ్‌ చేసిన ‘ఊ అంటావా.. ఊఊ అంటావా మామ..’ అనే ఐటెం సాంగ్‌ ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికి తెలిసిందే. పుష్ప సినిమాకి ఆ సాంగ్ వన్‌ ఆఫ్‌ ద ఎట్రాక్షన్‌ గా నిలిచి వరల్డ్ వైడ్ వైరల్ అయింది.

Also Read : Prabhas Sister : ప్రభాస్ చెల్లి ఎంత పని చేసింది.. రాఖీ రోజు అందరితో ఫొటోలు షేర్ చేసి.. నిరాశలో ఫ్యాన్స్..

దీంతో పెద్ది సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌పై నెక్స్ట్‌ లెవల్‌ క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఆల్రెడీ డైరెక్టర్ బుచ్చిబాబు దీని గురించి సమంతతో మాట్లాడాడు అని, సమంత నుంచి కన్ఫర్మేషన్‌ రావాల్సి ఉందని సమాచారం. డైరెక్టర్‌ బుచ్చిబాబు సుకుమార్‌ శిష్యుడు కావడం, ఆల్రెడీ చరణ్‌తో సమంత వర్క్‌ చేసి ఉండటం, పుష్ప, రంగస్థలం సినిమాల్ని ప్రొడ్యూస్‌ చేసిన నిర్మాతలు పెద్ది సినిమాలో పార్ట్‌ అవ్వడంతో ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

దీంతో రామ్‌ చరణ్‌-సమంత కాంబినేషన్‌లో వచ్చే ఈ స్పెషల్‌ సాంగ్‌ని డైరెక్టర్‌ బుచ్చిబాబు ఎలా తెరకెక్కిస్తారోనని చరణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే మరోసారి సమంత ఐటెం సాంగ్ లో ఏ రేంజ్ లో హాట్ గా కనిపిస్తుందో అని సామ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు మేనకోడలిని చూశారా? సుధీర్ బాబు తనయులతో రాఖీ స్పెషల్ ఫోటో వైరల్..

పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమా షూటింగ్‌ ఆల్రెడీ 50 శాతం పూర్తయ్యింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో నైట్‌ షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేశారు. రామ్‌ చరణ్, జాన్వీకపూర్‌పై లవ్‌ సీన్స్‌తో పాటు ఇతర ముఖ్యమైన సన్నివేశాల్ని షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ టాలీవుడ్ సమ్మెతో షూటింగ్‌పై ఎఫెక్ట్‌ పడింది. నవంబర్‌ లోగా సినిమాని పూర్తి చేయాలనే టార్గెట్‌తో ఉన్నారు బుచ్చిబాబు. నెక్స్ట్ ఇయర్‌ మార్చి 27న చరణ్‌ బర్త్‌ డేకి పెద్ది థియేటర్స్‌లోకి రానుంది.

Exit mobile version