Hi Nanna : ‘హాయ్ నాన్న’ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. సమయమా..!
‘హాయ్ నాన్న’ మొదటి సింగల్ ప్రోమో వచ్చేసింది. సమయమా అంటూ..

Samayama song promo released from nani Hi Nanna
Hi Nanna : నేచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత చేస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుంది. షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కి కూడా తెరలేపారు. ఈనేపథ్యంలోనే మ్యూజికల్ జర్నీని మొదలుపెట్టారు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.
Meenakshi Chaudhary : మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి..?
‘సమయమా’ సాంగ్ ప్రోమో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ ‘హేశం అబ్దుల్ వహాబ్’ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫుల్ సాంగ్ ని రేపు (సెప్టెంబర్ 16) ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. హేశం అబ్దుల్ ఇటీవల విజయ్ ‘ఖుషి’ సినిమా ఆల్బమ్ తో మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మ్యూజిక్ పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.
Devil : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ దర్శకనిర్మాతల మధ్య విబేధం.. ట్వీట్ వైరల్!
Tomorrow 🙂#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame#HiNanna pic.twitter.com/zYpkVQ1Kp9
— Nani (@NameisNani) September 15, 2023
కాగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తుంది. శ్రుతి హాసన్ (Shruti Haasan) ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ లో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. నాని గతంలో జెర్సీ సినిమాలో ఫాదర్ గా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో మరోసారి తండ్రిగా కనిపిస్తుండడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి.