Severe Cold Wave: 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. చలి భరించాల్సిందే..

ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

Severe Cold Wave: 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. చలి భరించాల్సిందే..

Updated On : December 29, 2025 / 8:57 AM IST

Severe Cold Wave: తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. అనేక జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఎండ వచ్చేవరకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చలితీవ్రత ఎప్పటికీ తగ్గుముఖం పడుతుందోనని జనాలు ఎదురుచూస్తున్నారు.

అయితే, చలి తీవ్రత ఇప్పట్లో తగ్గేలా లేదు. సోమ, మంగళవారాల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

Also Read: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి.. తొలి 3 రోజులు వీరికి మాత్రమే అనుమతి.. భారీ భద్రత

కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 7.5 డిగ్రీల లోపు నమోదయ్యాయి. అలాగే, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, వికారాబాద్‌, సిద్దిపేట, హైదరాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది.