Samyuktha Menon : సంయుక్త ఎమోషనల్.. సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్ కి భారీ గిఫ్ట్స్ ఇచ్చిన సంయుక్త..

సంయుక్త నటనకు, అందానికే కాక ఇప్పుడు ఆమె చేసే మంచి పనులకు కూడా ఫిదా అవుతున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

Samyuktha Menon : సంయుక్త ఎమోషనల్.. సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్ కి భారీ గిఫ్ట్స్ ఇచ్చిన సంయుక్త..

Samyukta Menon helped single parent young women

Updated On : May 1, 2023 / 10:31 AM IST

Samyuktha Menon :  ఇటీవల సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా వచ్చిన విరూపాక్ష(Virupaksha) సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పటికే విరూపాక్ష సినిమా దాదాపు 65 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో సంయుక్త నటనకు మంచి మార్కులు పడ్డాయి. సంయుక్త యాక్టింగ్ కి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. విరూపాక్ష సినిమాతో సంయుక్తకు బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్స్ వచ్చాయి టాలీవుడ్(Tollywood) లో. దీంతో సంయుక్త టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది ప్రస్తుతం.

ఇక సంయుక్త నటనకు, అందానికే కాక ఇప్పుడు ఆమె చేసే మంచి పనులకు కూడా ఫిదా అవుతున్నారు అభిమానులు, ప్రేక్షకులు. ఇటీవల విరూపాక్ష సినిమా ప్రేక్షకులతో కలిసి చూడటానికి వెళ్లగా థియేటర్లో డైరెక్టర్ కార్తీక్ ఫోన్ పోవడంతో సంయుక్త డైరెక్టర్ కు ఐఫోన్ కొనిచ్చింది. ఈ విషయంలో సంయుక్తని అంతా అభినందిస్తున్నారు. తాజాగా సంయుక్త చేసిన మరో మంచిపనికి మరింతమంది సంయుక్తని అభినందిస్తున్నారు.

ఇటీవల విరూపాక్ష టీంతో కలిసి సంయుక్త మీనన్ ఓ టీవీ షోలో పాల్గొంది. దీంట్లో పలు గేమ్స్ పెట్టి అవి విన్ అయితే స్కూటీ ఇస్తామని చెప్పారు. అయితే తేజ్ ఈ స్కూటీని గెలిస్తే అక్కడ షోలో ఉన్న స్టూడెంట్స్ లో ఎవరికో ఒకరికి ఇస్తాను అన్నాడు. సంయుక్త ఆ గేమ్ లో గెలవడంతో అయినా సరే తేజ్ చెప్పినట్టు ఈ స్కూటీ ఇస్తాను అని అంది. అయితే తానూ సింగిల్ పేరెంట్ చైల్డ్ అని, తన ఫాదర్ లేరని, మా అమ్మే నన్ను కష్టపడి పెంచింది అంటూ ఎమోషనల్ అయింది.

అందుకే ఇక్కడ ఉన్న స్టైడెంట్స్ లో సింగిల్ పేరెంట్ ఉన్న అమ్మాయిలు రమ్మనడంతో ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు కాలేజీ చదువుతున్నామని, కాలేజీకి రోజు బస్సులో వెళ్తామని చెప్పారు. అయితే అక్కడ ఒక స్కూటీనే ఉండటంతో సంయుక్త ఆ స్కూటీ ఒక అమ్మాయికి ఇచ్చి ఇంకో అమ్మాయికి తానే స్వయంగా స్కూటీ కొనిస్తానని చెప్పింది. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎమోషనల్ అయి సంయుక్తని హత్తుకున్నారు. సంయుక్త కూడా ప్రేమగా వారిని హత్తుకుంది.

Samyuktha Menon : విరూపాక్ష డైరెక్టర్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్.. ఏం ఇచ్చిందో తెలుసా?

దీంతో అభిమానులు, నెటిజన్లు సంయుక్త మంచి మనుసును అభినందిస్తున్నారు. మొన్న డైరెక్టర్ కి ఫోన్, ఇవాళ సింగిల్ పేరెంట్ అమ్మాయిలకు స్కూటీలు కొనివ్వడంతో బ్యూటీ విత్ గోల్డెన్ హార్ట్ అని పొగిడేస్తున్నారు అంతా. ఇక వరుస హిట్స్ పడటంతో తెలుగులో మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఈ మలయాళీ భామకు.