Samyuktha Virupaksha hit and next kalyan ram devil
Samyuktha : మలయాళ కుట్టి సంయుక్త టాలీవుడ్ మేకర్స్ కి గోల్డెన్ లెగ్ అయ్యిపోయింది. ఈ అమ్మడు ఏ సినిమాలో నటించిన సూపర్ హిట్ అయ్యిపోతుంది. కేవలం హిట్ మాత్రమే కాదు ఆయా హీరోల కెరీర్ లో బెస్ట్ గా నిలుస్తున్నాయి చిత్రాలు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఆ చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సరసన బింబిసార సినిమాలో నటించగా.. ఆ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.
Virupaksha Collections: విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్.. తేజు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడుగా!
ఈ చిత్రం తరువాత తమిళ హీరో ధనుష్ సరసన తెలుగు సినిమా సార్ చిత్రంలో నటించింది. అది కూడా ధనుష్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. తాజాగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సరసన విరూపాక్షలో (Virupaksha) నటించింది. నిన్న (ఏప్రిల్ 21) రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. తొలిరోజు ఏకంగా రూ.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సాయి ధరమ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం 200K డాలర్లకు పైగా వసూళ్లు చేసినట్లు సమాచారం.
Virupaksha: యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ‘విరూపాక్ష’ విశ్వరూపం.. తొలిరోజు సాలిడ్ వసూళ్లు!
ఇక ఈ సినిమాకి కూడా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తుండడంతో టాలీవుడ్ ఆడియన్స్ సంయుక్తని గోల్డెన్ లెగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో ఈ అమ్మడికి డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ భామ కళ్యాణ్ రామ్ తో కలిసి డెవిల్ (Devil) సినిమాలో నటిస్తుంది. ఆల్రెడీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకోవడంతో ఈ మూవీ పై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. టీజర్ కూడా రిలీజ్ కాకముందే హిట్ అవుతుంది అంటూ జోష్యం చెబుతున్నారు. మరి డెవిల్ సంయుక్త సక్సెస్ కి బ్రేక్ వేస్తుందా? లేదా కొనసాగిస్తుందా? అనేది చూడాలి.