విలక్షణ నటులకు వినూత్న నివాళి..

ప్రముఖ బాలీవుడు నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లకు సైతక శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఘన నివాళి..

  • Published By: sekhar ,Published On : May 1, 2020 / 08:08 AM IST
విలక్షణ నటులకు వినూత్న నివాళి..

Updated On : May 1, 2020 / 8:08 AM IST

ప్రముఖ బాలీవుడు నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లకు సైతక శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఘన నివాళి..

బాలీవుడ్ విలక్షణ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ ఒక్కరోజు వ్యవధిలో ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఇద్దరూ కూడా క్యాన్సర్ మహమ్మారితో పోరాడినవారే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి అంత్యక్రియలకు సెలబ్రిటీలు, అభిమానులు హాజరు కాలేకపోయారు. రెండు రోజుల్లో ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కన్నుమూయడంతో బాలీవుడ్ పరిశ్రమ షాక్‌కి గురైంది. కాగా సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు ఇర్ఫాన్, రిషి కపూర్‌లకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ రిషి, ఇర్ఫాన్‌లకు నివాళులు అర్పిస్తూ ఒడిశాలోని పూరి బీచ్‌లో భారీ సైతక శిల్పాలు రూపొందించారు. ‘Not Taking a moment to say goodbye. RIP. అంటూ ఇర్ఫాన్‌కు, Hero of Million Hearts Om Shanti..’ అంటూ రిషి కపూర్‌కు తన Sand Artతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు సుదర్శన్.