టీవీ యాంకర్ అనుశ్రీకి మాజీ సీఎం సహాయం ? ఎవరా సీఎం

TV anchor Anushree : కర్నాటక రాష్ట్రంలో శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే..తనకు డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని అనూశ్రీ శుక్రవారం ఒక వీడియో పోస్టు చేశారు.
కానీ..అనుశ్రీకి ఓ మాజీ ముఖ్యమంత్రి సహాయ హస్తం అందించినట్లు ప్రచారం జరుగుతోంది. అతను ఎవరో బయటపెట్టాలని మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి బెంగళూరులో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆరు మంది మాజీ సీఎంలున్నారని, ఎవరనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అనుశ్రీ పోస్టు చేసిన వీడియోపై సామాజిక కార్యకర్త సంబరిగి మండిపడ్డారు. అరెస్టు భయంతోనే నాటకమాడుతున్నారని, అరెస్టు కాకుండా ఓ గాడ్ ఫాదర్ రక్షించినట్లు ఆరోపించారు. దీనిపై సీపీ వికాస్ కుమార్ స్పందించారు. డ్రగ్ కేసు చాలా పెద్దదని, సీసీబీపై రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఈ కేసు ఒక ఛైన్ లింక్ లా కనిపిస్తోందని, చివర ఎక్కడ అనేది తెలియాల్సి ఉందన్నారు.
ఇప్పటి వరకు మంగళూరులో ఆరుగురిని అరెస్టు చేయడం జరిగిందని, నటీమణి రాగిణి, సంజనలతో కలిసి డ్రగ్స్ సరఫరా చేసిన వీరేన్ ఖన్నాపై గతంలోనే 4 కేసులు నమోదైనట్లు తేలింది.