Dirty Fellow : ‘డర్టీ ఫెలో’ నుంచి ‘సందెవేళ..’ సాంగ్ చూశారా? బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా..
తాజాగా ఈ డర్టీ ఫెలో సినిమా నుంచి 'సందె వేళ విందు ఉందిరా..' అనే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Sande Vela Song from Dirty Fellow Movie Released By Baby Director Sai Rajesh
Dirty Fellow : రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో జి.యస్.బాబు నిర్మాణంలో ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డర్టీ ఫెలో’. శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read : Allari Naresh : పాన్ ఇండియా ప్రాబ్లమ్ మీద అల్లరి నరేష్ సినిమా.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ
ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ లో ఉంది. తాజాగా ఈ డర్టీ ఫెలో సినిమా నుంచి ‘సందె వేళ విందు ఉందిరా..’ అనే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, చిత్ర హీరో శాంతిచంద్ర, మూవీ యూనిట్ పాల్గొన్నారు.
ఇక ఈ పాటని సతీష్ కుమార్ రాసి సంగీతం అందించగా శ్రావణభార్గవి పాడింది. ఈ పాటని దుబాయ్ షేక్ సాంగ్స్ మోడల్ లో రొమాంటిక్ గా తీశారు. సింగ్ రిలీజ్ అనంతరం దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ శాంతిచంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలో సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా త్వరలో రిలీజ్ అయ్యి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను అని తెలిపారు .