Allari Naresh : పాన్ ఇండియా ప్రాబ్లమ్ మీద అల్లరి నరేష్ సినిమా.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ

అల్లరి నరేశ్ 61వ సినిమాగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మాణంలో మల్లి అంకం దర్శకత్వంలో సినిమాని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Allari Naresh : పాన్ ఇండియా ప్రాబ్లమ్ మీద అల్లరి నరేష్ సినిమా.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ

Allari Naresh Aa Okkati Adakku Movie Title Glimpse Released

Updated On : February 16, 2024 / 4:54 PM IST

Allari Naresh : ఒకప్పుడు కామెడీ సినిమాలతో అందర్నీ నవ్వించిన అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో నాంది సినిమా నుంచి సీరియస్ సబ్జెక్టులతో మెప్పిస్తున్నాడు. వరుసగా సీరియస్ కథలతో వస్తుండటంతో అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమాలు దూరమవుతాయా అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మళ్ళీ కామెడీ సినిమాతో రాబోతున్నాడు.

అల్లరి నరేశ్ 61వ సినిమాగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మాణంలో మల్లి అంకం దర్శకత్వంలో సినిమాని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Also Read : Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా? నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో అల్లరి నరేష్ ని చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అన్ని భాషల్లో అడిగేస్తుంటే.. ఏంటి ఇది పాన్ ఇండియా సినిమానా అని అల్లరి నరేష్ ని అడిగితే కాదు పాన్ ఇండియా ప్రాబ్లమ్ మీద సినిమా అని ఫన్నీగా చూపించారు. పెళ్లి గురించి అడిగితే ఆ ఒక్కటీ అడక్కు అంటూ అల్లరి నరేష్ టైటిల్ గ్లింప్స్ తోనే నవ్వించేసాడు. ఈ సినిమాతో మళ్ళీ తన కామెడీ జానర్ లో హిట్ కొడతాడనిపిస్తుంది. ఇక ఈ ‘ఆ ఒక్కటీ అడక్కు'(Aa Okkati Adakku) సినిమా మార్చ్ 22న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ గ్లింప్స్ మీరు కూడా చూసి నవ్వేయండి.