Arjun Reddy 2 : అర్జున్ రెడ్డి 2 ఉందా..? పెళ్లి అయ్యాక అర్జున్ రెడ్డి ఎలా బిహేవ్ చేస్తాడు..?
తాజాగా ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డి సీక్వెల్ కి సందీప్ వంగ దగ్గర ఒక లైన్ ఉందట.

Sandeep Reddy Vanga and Vijay Devarakonda will Plan Arjun Reddy 2 Rumours goes Viral
Arjun Reddy 2 : టాలీవుడ్ లో ఇప్పటి జనరేషన్ లో ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఒకప్పుడు బాలీవుడ్ కి ప్టిమితమైన ముద్దు సీన్లు, బోల్డ్ డైలాగ్స్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి కూడా వచ్చాయి. ప్రేమ కథని ఒక రియలిస్టిక్ గా చూపించి సక్సెస్ అయ్యారు.
అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్, విజయ్ ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా ఎడిటింగ్ వర్షన్ లో ఇంకా చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయని, కట్ చేసిన సినిమా ఆల్మోస్ట్ ఇంకో గంట ఉంటుందని సందీప్ చెప్పాడు. దీంతో అర్జున్ రెడ్డి ఫుల్ వర్షన్ రిలీజ్ చేయమని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో అడుగుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డి సీక్వెల్ కి సందీప్ వంగ దగ్గర ఒక లైన్ ఉందట.
Also Read : Saripodhaa Sanivaaram : దసరా తర్వాత మరో వంద కోట్లు సాధించిన నాని.. లెక్క సరిపోయింది..
అర్జున్ రెడ్డి క్లైమాక్స్ లో హీరో ప్రగ్నెంట్ తో ఉన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. అయితే అర్జున్ రెడ్డి సీక్వెల్ లో పెళ్లి అయిన తర్వాత అర్జున్ రెడ్డి ఎలా ఉంటాడు, అతని ప్రేమ ఎలా ఉంటుంది, అర్జున్ రెడ్డి ఎలా బిహేవ్ చేస్తాడు అనే పాయింట్ మీద రాసుకోవచ్చు అని ఇటీవల సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ అయితే అర్జున్ రెడ్డి 2 ప్లాన్ చేయమని అంటుంటే, కొంతమంది దానికి అర్జున్ రెడ్డి సీక్వెల్ ఎందుకు యానిమల్ సినిమా చూస్తే సరిపోద్ది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. యానిమల్ లో హీరో క్యారెక్టర్ ప్రేమ విషయంలో మాత్రం అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కి దగ్గరగానే ఉంటుంది. ఆ సినిమాలో హీరో – హీరోయిన్ పెళ్లి తర్వాతే కథ ఉంటుంది. మరి అర్జున్ రెడ్డి 2 తీస్తారా చూడాలి.