Sandeep Reddy Vanga comments about bollywood paid media system
Sandeep Vanga : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ.. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఈ బోల్డ్ అండ్ వైల్డ్ కంటెంట్ తో ఉందని, యువతని పెడదారి పట్టించేలా సినిమా చిత్రీకరించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక బాలీవుడ్ లోని క్రిటిక్స్ అయితే.. సందీప్ పై, యానిమల్ పై ఓ రేంజ్ లో నెగటివ్ ఫీడ్ బ్యాక్స్ రాశారు. తాజాగా ఈ రివ్యూలు పై సందీప్ వంగ రియాక్ట్ అయ్యారు.
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. “ఐదేళ్లు నేను ముంబైలో ఉంది తెలుసుకున్నది ఏంటంటే.. ఇక్కడ కొన్ని గ్యాంగ్స్ (క్రిటిక్స్) ఉన్నాయి. వాళ్ళు కొందరు ఫిలిం మేకర్స్ దగ్గర డబ్బులు తీసుకోని వాళ్ళ సినిమాలను పొగుడుతూ మంచి రివ్యూలు ఇస్తూ వస్తారు. వాళ్లంతా నా సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు గురించే మాట్లాడుతున్నారు తప్ప ఆ మూవీలోని క్రాఫ్ట్ గురించి, సినిమా ఓపెనింగ్ గురించి ఎవరు మాట్లాడారు. రాయరు. ఎందుకంటే వాళ్ళకి అవేవి తెలియదు. వాళ్ళకి వాటి పై అవగాహనా లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Aslo read : Salaar : సలార్ మూవీ ఎండింగ్‌లో ఒక సర్‌ప్రైజ్ ఉంది.. ప్రశాంత్ నీల్..
Bollywood Mafia Gang is Real ?
EXPOSED by @imvangasandeep ??#SandeepVanga #AnimalMovie #AnimalPark #RanbirKapoor? #AnimalTheMovie #AnimalInCinemasNow pic.twitter.com/3rjlOAb3cq
— iPAC Reddy (@iPACTweets) December 20, 2023
ఇక ఇదే ఇంటర్వ్యూలో యానిమల్ సీక్వెల్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు. ప్రభాస్ తో ‘స్పిరిట్’ తరువాత ‘యానిమల్ పార్క్’ తెరకెక్కించనున్నారట. ఆ తరువాతే అల్లు అర్జున్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. దీంతో బన్నీ అభిమానులు కొంచెం నిరాశ చెందుతున్నారు. ప్రభాస్ స్పిరిట్ మూవీని నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో మొదలు పెట్టబోతున్నారు. ఆ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు. స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ సినిమాలను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి-సిరీసే నిర్మించబోతోంది.