Salaar : సలార్ మూవీ ఎండింగ్‌లో ఒక సర్‌ప్రైజ్ ఉంది.. ప్రశాంత్ నీల్..

మూవీ ఎండింగ్ లో ఓ సర్‌ప్రైజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ హైప్ ని క్రియేట్ చేయడానికి, సెకండ్ పార్టు చూడడానికి ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకు వచ్చేలా..

Salaar : సలార్ మూవీ ఎండింగ్‌లో ఒక సర్‌ప్రైజ్ ఉంది.. ప్రశాంత్ నీల్..

Prashanth Neel commented a surprise is planned in Salaar ending credits

Updated On : December 20, 2023 / 6:54 PM IST

Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపిస్తూ రూపొందిన చిత్రం సలార్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. పార్ట్ 1 డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ కి కనెక్షన్ ఉంటుందా..? యశ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారా..? ఇలా పలు ప్రశ్నలు ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి.

తాజాగా ఇవే ప్రశ్నలను రాజమౌళి, ప్రశాంత్ నీల్ ని ప్రశ్నించారు. సలార్ టీంతో రాజమౌళి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. “కేజీఎఫ్‌కి, సలార్‌కి కనెక్షన్ ఉందా” అని ప్రశ్నించారు. దానికి ప్రశాంత్ నీల్ బదులిస్తూ.. “ఎటువంటి కనెక్షన్ లేదు. కేజీఎఫ్ 1980’s టైములో జరుగుతుంది. సలార్ ప్రెజెంట్ లో జరుగుతుంది. ఆ రెండు యూనివర్స్ లని కలపడం కూడా నా వల్ల కాదు. అలాంటి ధైర్యం కూడా చేయలేదు” అంటూ చెప్పుకొచ్చారు.

Also read :Salaar : సలార్ ట్రైలర్‌లో యశ్ ఉన్నాడా..? ఆ సీన్‌ని మీరు గమనించారా..?

ఇక ఇదే ఇంటర్వ్యూలో రాజమౌళి.. “ఆడియన్స్ తెలియకుండా ఏమన్నా దాచి ఉంచారా?” అని ప్రశ్నించగా, ప్రశాంత్ నీల్ బదులిస్తూ.. ” మూవీ ఎండింగ్ లో ఓ సర్‌ప్రైజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ హైప్ ని క్రియేట్ చేయడానికి, సెకండ్ పార్టు చూడడానికి ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకు వచ్చేలా ఆ సర్‌ప్రైజ్ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ ఎండింగ్ సన్నివేశంలో ఏముండబోతుంది. ఎవరన్నా గెస్ట్ అపిరెన్స్ ఉండబోతుందా.

ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో యశ్ కనిపించాడంటూ అభిమానులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఒక బుల్లి సింగర్ సలార్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రభాస్, యశ్, పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ పాడినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆ చివరి షాట్ లో యశ్ కనిపించబోతున్నాడంటూ చెబుతున్నారు. యశ్ సలార్ లో కనిపించాలంటే.. రాకీ భాయ్ గానే కనిపించాలా ఏంటి? మరో కొత్త పాత్రలో, సలార్ వరల్డ్ కి సంబంధించిన ఒక కొత్త రోల్ తో యశ్ కనిపించే అవకాశం ఉంది కదా.