Mahesh Babu : మహేష్ బాబుతో సినిమా గురించి సందీప్ వంగా కామెంట్స్.. రామ్‌చరణ్‌తో కూడా..

మహేష్ బాబుతో సినిమా గురించి సందీప్ వంగా కామెంట్స్. మహేష్ గారికి ఓ కథ చెప్పాను. అయితే..

Mahesh Babu : మహేష్ బాబుతో సినిమా గురించి సందీప్ వంగా కామెంట్స్.. రామ్‌చరణ్‌తో కూడా..

Sandeep Reddy Vanga comments about movie with Mahesh Babu

Updated On : November 26, 2023 / 8:36 AM IST

Mahesh Babu : సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఈ రెండు చిత్రాల తరువాత ఈ దర్శకుడు మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నారంటూ ఆ మధ్య ఓ వార్త వినిపించింది. కానీ అది ఎందుకో సెట్ అవ్వలేదు. దీంతో సందీప్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది.

మహేష్ బాబుకి చెప్పిన కథ యానిమల్ మూవీనే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కథకి ఎలా నో చెప్పావు అన్నా అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఇక తాజాగా సందీప్ వంగా మహేష్ బాబు సినిమా గురించి కామెంట్స్ చేశారు. “మహేష్ బాబు గారికి ఓ కథ చెప్పాను. అది ఆయనకి కూడా నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ వలన అది ముందుకు వెళ్ళలేదు. కానీ భవిషత్తులో మహేష్ బాబు, రామ్ చరణ్ గారు ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని ఉంది” అంటూ సందీప్ వంగా పేర్కొన్నారు.

Also read : Randeep Hooda : లేటు వ‌య‌సులో.. ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ హీరో..

ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ చేయనున్నారు. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో మొదలు కానుందట. ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ తో ఒక మూవీ చేయాల్సి ఉంది. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాతో మరో మూడు సంవత్సరాలు కమిట్ అయ్యి ఉంటారు. దీని బట్టి చూస్తే మహేష్, సందీప్ వంగా కాంబినేషన్ లో సినిమా చూడాలంటే 2027 వరకు ఆగాల్సిందే. కాగా సందీప్ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.