Deepika Padukone : ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకోన్ ని తప్పించిన సందీప్ వంగ..? కారణాలు ఇవేనా?
తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకోన్ ని సందీప్ వంగ తప్పించాడని, దీపికానే తప్పుకుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Sandeep Reddy Vanga Removed Deepika Padukone from Prabhas Spirit Movie
Deepika Padukone : సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టి సిరీస్ ఫిలిమ్స్, సందీప్ రెడ్డి కలిసి పాన్ వరల్డ్ సినిమాగా స్పిరిట్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూట్ డిసెంబర్ నుంచి మొదలవుతుందని, మెక్సికో లో మొదటి షెడ్యూల్ అని కొన్ని రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగ తెలిపాడు.
ప్రభాస్ పోలీస్ పాత్ర అని చెప్పడం, పాన్ వరల్డ్ రిలీజ్ అనడం, సందీప్ రెడ్డి వంగ సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ని హీరోయిన్ గా అనుకున్నారని, ఆల్రెడీ అన్ని మాట్లాడేసుకున్నారని షూటింగ్ కి వెళ్లడమే అని వార్తలు కూడా వచ్చాయి.
అయితే తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకోన్ ని సందీప్ వంగ తప్పించాడని, దీపికానే తప్పుకుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ప్రభాస్ తో కల్కి సినిమాలో దీపికా నటించింది కదా మరి స్పిరిట్ సినిమా నుంచి ఎందుకు తప్పుకుంటుంది అని సందేహం వ్యక్తపరుస్తున్నారు.
దీపికా పదుకోన్ ని ఈ సినిమా నుంచి తప్పించడానికి చాలానే కారణాలు ఉన్నాయట. దీపికా అనేక కండిషన్స్ పెట్టిందట. ఈ కండిషన్స్ నచ్చకే సందీప్ సినిమా నుంచి తీసేశాడని అంటున్నారు. రోజు 8 గంటలు మాత్రమే షూటింగ్ కి సమయం ఇస్తానని, అందులో 6 గంటలు మాత్రమే షూట్ చేస్తానని చెప్పిందట. ఆల్మోస్ట్ 20 కోట్ల భారీ రెమ్యునరేషన్ అడగడంతో పాటు ప్రాఫిట్స్ లో కూడా వాటా అడిగిందట. ఇక తెలుగు డబ్బింగ్ సొంతగా చెప్పమని అడిగితే నో అని చెప్పిందట. దీపికాకి ప్రగ్నెన్సీ, పాప పుట్టడంతో స్పిరిట్ సినిమా మొదలవడం ఆలస్యం అయిందట. అలాగే డైరెక్టర్ సందీప్ వంగకు దీపికాకు అస్సలు పడట్లేదట. వీరిద్దరి మధ్య పలు విబేధాలు వచ్చాయని సమాచారం.
ఇలా అనేక కారణాలతోనే సందీప్ వంగ కి విసుగొచ్చి దీపికాని స్పిరిట్ సినిమా నుంచి తప్పించాడని బాలీవుడ్ మీడియా అంటుంది. మరి స్పిరిట్ లో ప్రభాస్ పక్కన ఎవరు నటిస్తారో చూడాలి.