Sandhya Theatre Stampede Case Allu Arjun Gets Relief From Nampally Court
సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఇక పై ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలనే నిబంధన నుంచి మినహాయింది. అంతేకాదు.. విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. దీనిపై బన్నీ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు.
Prabhas – Ramcharan : ప్రభాస్ పెళ్లి పై రామ్‌చరణ్ హింట్..! అమ్మాయి ఎవరంటే..?
ఆ తరువాత రిమాండ్ గడువు ముగిసిన తరువాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టులో వేశారు అల్లు అర్జున్. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.50 వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్‌కు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దు అనే షరతులను విధించింది. ఇక న్యాయస్థానం ఆదేశాల మేరకు గత ఆదివారం చిక్కడపల్లి పీఎస్‌కు అల్లుఅర్జున్ స్వయంగా హాజరు అయి సంతకం చేసి వెళ్లారు.
కాగా.. భద్రతా కారణాలతో పీఎస్‌కు హాజరు అయ్యే నిబంధనను మినహాయించాలని కోరారు. ఇందుకు కోర్టు సానుకూలంగా స్పందించి మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
Game Changer collections : రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా?