Game Changer collections : రామ్‌చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా?

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.

Game Changer collections : రామ్‌చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజ‌ర్’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా?

Ram Charan Game Changer first day collections details here

Updated On : January 11, 2025 / 10:34 AM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా నిన్న (జ‌న‌వ‌రి 10 శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే మంచి స్పంద‌న‌ను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌గా ద్వారా తెలియ‌జేసింది.

‘థియేట‌ర్ల‌లో కింగ్ సైజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఆవిష్క‌రించారు. ఈ మాస్ ఎంటర్ టైన‌ర్ బ్లాక్‌బస్ట‌ర్ ఓపెనింగ్ ను సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.186 కోట్ల గ్రాస్‌ వ‌సూళ్ల‌ను సాధించింది.’ అని ట్వీట్ చేసింది. ఈ విష‌యం తెలిసి రామ్‌చ‌ర‌ణ్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

100 Crores : ‘ఆహా’లో మరో థ్రిల్లింగ్ సినిమా.. ‘100 క్రోర్స్’.. దయ్యాలు డబ్బులు ఎత్తుకుపోవడం ఏంటి?

ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో తొలి రోజే 1.3 మిలియ‌న్ల‌కు పైగా గేమ్ ఛేంజ‌ర్ టికెట్లు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. శ‌ని, ఆదివారాల్లో ఈ టికెట్ల అమ్మ‌కాలు మ‌రింతగా పెర‌గ‌నున్న‌ట్లు సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Agent Guy001 Trailer : హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్ మూవీ ‘ఏజెంట్ గై 001’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ చిత్రం తెర‌కెక్కింది. కియారా అద్వానీ క‌థానాయిక‌. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్‌జే సూర్య‌, శ్రీకాంత్‌, అంజ‌లి, సునీల్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.