Agent Guy001 Trailer : హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్ మూవీ ‘ఏజెంట్ గై 001’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటిస్తున్న ఏజెంట్ గై 001.

Agent Guy001 Trailer : హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్ మూవీ ‘ఏజెంట్ గై 001’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

Agent Guy001 Movie Official Telugu Trailer out now

Updated On : January 11, 2025 / 9:06 AM IST

బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఏజెంట్ గై 001. డేవిడ్ ఆండర్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే అందించ‌గా ఎరిక్ ఆండర్సన్ నిర్మిస్తున్నారు. ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డెన్నిస్ ఆండర్సన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆంటోన్ కార్ల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఈ హాలీవుడ్ డ‌బ్బింగ్ చిత్రాన్నితెలుగులో పి శ్రీనివాస గౌడ్ నిర్మిస్తూ సహాయ నిర్మాతగా పి హేమంత్ వ్యవహరిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Tollywood : టాలీవుడ్ టాప్ హీరోల కొత్త స్ట్రాటజీ?

డబ్బు చుట్టూ తిరిగే ఒక పొలిటికల్ డ్రామాలా ఈచిత్రం ఉండ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. మేయర్ సీటు కోసం జరిగే ఫైట్స్, అడ్వెంచర్లు ఉన్నట్లు అర్థమవుతుంది. ఎంతో నాణ్య‌త‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది.