Sandigdham : ‘సందిగ్ధం’ టీజర్ రిలీజ్..

Sandigdham

Sandigdham : ‘సందిగ్ధం’ టీజర్ రిలీజ్..

Sandigdham

Updated On : November 1, 2025 / 9:11 AM IST

Sandigdham : తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్ద సారథి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సందిగ్ధం’. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని సీనియర్ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ రిలీజ్ చేశారు.(Sandigdham)

సందిగ్ధం టీజర్ ఇక్కడ చూసేయండి..

టీజర్ లాంచ్ అనంతరం నటుడు, నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడు సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగింది. పది, పదిహేను కోట్లు లేకపోతే సినిమా తీయలేకపోతోన్నాము. మూవీకి మంచి టాక్ వస్తేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. సందిగ్ధం టీజర్ గ్రిప్పింగ్‌గా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్ అవ్వాలని అన్నారు.

Also Read : Vijay – Rashmika : నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఇద్దరూ ఒకే స్టేజిపై..? ఫ్యాన్స్ కి పండగే.. ఇప్పటికైనా చెప్తారా?

హీరో నిహాల్, అశోక్ దేవ్ మాట్లాడుతూ.. పార్ద సారథి గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఆయన వల్లే నేను ఈ సినిమాలోకి వచ్చాను. పార్దు గారు, సంధ్య గారు ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారు అన్నారు.

దర్శకుడు పార్ద సారథి మాట్లాడుతూ.. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదు. నాకు వెన్నంటే ఉండి నా భార్య సంధ్య తోడుగా నిలిచింది. నన్ను దర్శకుడిగా చేయాలని ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించింది అని తెలిపారు.

Also See : Sravanthi Chokarapu : గంగూబాయి కతియావాడి లుక్స్ లో అదరగొడుతున్న యాంకర్ స్రవంతి.. ఫొటోలు..