Sanjay Dutt : సౌత్ ఇండస్ట్రీకి దొరికిన కొత్త విలన్.. వరుస సినిమాలతో బిజీగా సంజయ్ దత్..
సంజయ్ దత్ .. పూరీ జగన్ డైరెక్షన్లో రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో విలన్ బిగ్ బుల్ రోల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. సాలిడ్ లుక్ లో ఉన్న సంజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.

Sanjay Dutt become most powerful and busy villain in south industry also
Sanjay Dutt : పాన్ ఇండియా వైడ్ గా కొత్త విలన్ దొరికాడు. బాలీవుడ్ లోనే కాదు తెలుగు, తమిళ్, కన్నడ ఇలా సౌత్ మొత్తాన్ని కవర్ చేస్తూ మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోయాడు సంజయ్ దత్. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఆసినిమాలు చేసిన సంజయ్ దత్ ఆ తర్వాత లైఫ్ లో అనేక కష్టాలు, నెగిటివిటి ఎదుర్కొని చాలా గ్యాప్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు వేస్తూ ఈ మధ్య కాలంలో ఏ బాలీవుడ్ సీనియర్ స్టార్ కి లేనంత క్రేజ్ సంపాదించుకున్నాడు సంజయ్ దత్.
సంజయ్ దత్ పాన్ ఇండియా విలన్ గా మారిపోయి సౌత్ టూ నార్త్ టాప్ ఇండస్ట్రీల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ అయ్యారు. ఇప్పటికే రూత్ లెస్ విలన్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్న సంజయ్ దత్ లేటెస్ట్ గా తెలుగులో డబల్ ఇస్మార్ట్ సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగులో నాగార్జున చంద్రకళ సినిమాలో ఓ పాత్రలో కనిపించిన సంజయ్ దత్ దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ లో విలన్ గా నటించబోతున్నాడు.
సంజయ్ దత్ .. పూరీ జగన్ డైరెక్షన్లో రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో విలన్ బిగ్ బుల్ రోల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. సాలిడ్ లుక్ లో ఉన్న సంజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది టీమ్. ఇప్పటికే తమిళ్ లో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ నటించిన లియో మూవీలో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. జనరల్ గా లోకేష్ సినిమాల్లో విలన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. అలాంటిది తమిళ్ లో చేస్తున్న లియోలో సంజయ్ విజయ్ కి గట్టిపోటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. సంజయ్ దత్ .. ఆల్రెడీ కన్నడలో కెజిఎఫ్ తో సాలిడ్ ఎంట్రీ ఇచ్చారు. కెజిఎఫ్ లో హీరో కి టఫ్ ఫైట్ ఇచ్చిన అధీరా క్యారెక్టర్ లో సంజయ్ అదరగొట్టాడు.
Saif Alikhan Sara Alikhan : మొదటిసారి కలిసి నటించిన బాలీవుడ్ తండ్రి కూతుళ్లు.. సైఫ్, సారా..
బాలీవుడ్ లో కూడా వరుస విలన్ పాత్రలు చేస్తూ వరసగా లాస్ట్ ఇయర్ కన్నడలో ఎంట్రీ, ఈ సంవత్సరం తెలుగు, తమిళ్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా రేంజ్ విలన్ గా పాపులర్ అయిపోతున్నారు సంజయ్ దత్. దీంతో సౌత్ కి మరో పవర్ ఫుల్ విలన్ దొరికాడని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.