Sanjay Dutt Latest Photo: లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజూ బాబా లుక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ఎయిర్‌పోర్టులో ఓ అభిమానితో సంజయ్ దత్ దిగిన ఈ ఫొటోలో.. ఆయన చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. కండలు తిరిగిన దేహంతో, బలిష్టంగా ఉండే సంజూ బాబా లేటెస్ట్ లుక్ చూసి ఆయన అభిమానులు షాకవుతున్నారు.
ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంజయ్ ముంబైలోనే కీమో థెరపీ చికిత్సను తీసుకుంటున్నారు.