Sankranthi 2024 Theatrical Releasing Telugu Movies Full List Details Here
Sankranthi Movies : మనకు సంక్రాంతి పెద్ద పండగ. సౌత్ లో అయితే చాలా గ్రాండ్ గా ఫ్యామిలీలు అన్ని కలిసి చేసుకుంటాయి. ఓ వారం రోజుల పాటు ఊళ్ళల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతి అంటే టాలీవుడ్ కి కూడా పెద్ద పండగ. ఎన్నో ఏళ్ళ నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు స్టార్ హీరోల సినిమాలు బరిలో నిలుస్తాయి. సంక్రాంతికి వచ్చే చాలా సినిమాలు విజయాన్ని నమోదు చేస్తాయి, కలెక్షన్స్ రాబడతాయి.
సంక్రాంతి బరిలో దిగడానికి స్టార్ హీరోల నుంచి చిన్న సినిమాల వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కనీసం సంక్రాంతికి ప్రతి సినీ పరిశ్రమ నుంచి రెండు సినిమాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ అయితే నిర్మాతలు కూర్చొని మాట్లాడుకొని కొన్ని సినిమాలని పక్కకు తప్పించడం లేదా డేట్స్ మార్చడం చేస్తూ ఉంటారు. ఈసారి కూడా 2024 సంక్రాంతికి భారీ క్లాష్ వచ్చింది. తెలుగులోనే అయిదు సినిమాలు ప్రకటించారు సంక్రాంతికి.
దీంతో గత కొన్ని రోజులుగా సంక్రాంతి సినిమాల మీద చర్చలు సాగుతున్నాయి. నిర్మాతలు ఆ సినిమా యూనిట్స్ తో కూర్చొని మాట్లాడి ఫైనల్ చేశారు. నిన్న సాయంత్రమే తెలుగు సినిమా నిర్మాతల మండలి ప్రెస్ మీట్ జరగగా సంక్రాంతి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.
Also Read : Eagle : సంక్రాంతి నుంచి ‘ఈగల్’ అఫీషియల్‌గా అవుట్.. రిలీజ్ అప్పుడే.. టిల్లు 2, యాత్ర 2 కూడా వాయిదా..
తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి బరిలో నిలిచే తెలుగు సినిమాలు ఇవే..
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం'(Guntur Kaaram) సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న ‘హనుమాన్'(Hanuman) సినిమా కూడా జనవరి 12 న రిలీజ్ కాబోతుంది.
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh) హీరోగా తెరకెక్కిన ‘సైంధవ్'(Saindhav) సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.
విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna) హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ'(Naa Saami Ranga) సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.
దీంతో ఈ సారి సంక్రాంతికి తెలుగు సినిమాలే నాలుగు బరిలో ఉన్నాయి. మరి ఈ నాలుగులో ఏ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ముందు రవితేజ ఈగల్ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్నా తర్వాత ఇంత భారీ క్లాష్ మధ్యలో తప్పుకుంది.
ఇక తమిళ్ నుంచి శివకార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలు తెలుగులో రిలీజ్ చేయాలని భావించినా ఇంత భారీ క్లాష్ లో కష్టం అని భావించి కేవలం తమిళ్ రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. తర్వాత తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
Also Read : Yash Toxic : యశ్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ కాదా? ఈ బాలీవుడ్ భామ వర్కౌట్ అవుతుందా?